Advertisementt

పవన్ కోసం సుజిత్ లొకేషన్స్ వేట

Sun 26th Mar 2023 01:41 PM
og,pawan klayan  పవన్ కోసం సుజిత్ లొకేషన్స్ వేట
Pawan Original Gangster gets going పవన్ కోసం సుజిత్ లొకేషన్స్ వేట
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ తో పని చేస్తున్న దర్శకనిర్మాతలు ఇప్పుడు యమా స్పీడుగా ఉన్నారు. క్రిష్ తో చేస్తున్న హరి హర వీరమల్లు షూటింగ్ అప్ డేట్ లేదు కానీ.. హారిష్ శంకర్, సుజిత్ లు మాత్రం పవన్ తో రెగ్యులర్ షూట్ కోసం వెయిట్ చెయ్యడం కాదు.. ప్రిపేర్ అయ్యిపోతున్నారు.  ఈ నెల చివరి నుండి హరీష్ శంకర్ తో పవన్కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లోకి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. దానితో పాటుగా సుజిత్ మూవీ కూడా పవన్ మొదలెట్టేస్తారనే టాక్ నడుస్తుంది.

అందుకే సుజిత్ పవన్ కళ్యాణ్ OG కోసం ఎప్పటినుండో లొకేషన్స్ వేటలో ఉన్నాడు. ముంబై పరిసర ప్రాంతాల్లో పవన్ తో OG తెరకెక్కించే ప్లాన్ లో భాగంగా లొకేషన్ సెట్ చేసుకుంటున్నాడు. రీసెంట్ గా సుజిత్ తన ప్రొడక్షన్ డిజైనర్ ప్రకాష్, అలాగే DOP తో కలిసి లొకేషన్స్ వెతుక్కుంటున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ తన సెట్స్ లోకి వచ్చేసరికి అన్నీ పక్కాగా చేసుకుని ఉండేలా సుజిత్ ఫుల్ ప్రిపేర్ అవుతున్నాడు.

ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ గా పవన్ కళ్యాణ్ ని OGలో రఫ్ గా కనిపించనున్నారు. అటు ఉస్తాద్ భగత్ సింగ్ లో హరీష్ శంకర్ మరోసారి పవన్ తో పోలీస్ కేరెక్టర్ చేయించబోతున్నాడనే న్యూస్ కూడా ఉంది. మరి హరీష్ కూడా ప్రీ ప్రొడక్షన్ పని కంప్లీట్ చేసుకుని పవన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సముద్రఖని సినిమాలో తన పార్ట్ షూట్ కంప్లీట్ చేసేసారు.

Pawan Original Gangster gets going:

Pawan Kalyan OG goes on a hunt

Tags:   OG, PAWAN KLAYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ