రామ్ చరణ్ బర్త్ డే మార్చ్ 27. అంటే మరొక్క రోజు మాత్రమే చరణ్ బర్త్ డే కి సమయం ఉంది. రామ్ చరణ్ బర్త్ డే ని ఈసారి గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటున్నారు మెగా ఫాన్స్. ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు సాంగ్ తో ఆస్కార్ కొల్లగొట్టిన రామ్ చరణ్ బర్త్ డే ని మాములుగా సెలెబ్రేట్ చెయ్యకూడదు.. అద్దిరిపోవాలని అంటున్నారు. మరోపక్క ఆయన కొత్త చిత్రం RC15 నుండి ఫస్ట్ లుక్, అలాగే టైటిల్ అనౌన్స్ చేసేందుకు శంకర్ రెడీగా ఉన్నారు.
తాజాగా RC15 సెట్స్ లో రామ్ చరణ్ బర్త్ డే వేడుకలను నిర్వహించింది టీమ్. RC15 సాంగ్ షూటింగ్ కంప్లీట్ అవడంతో హీరోయిన్ కియారా అద్వానీ, దర్శకుడు శంకర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఇంకా నిర్మాత దిల్ రాజు, RC15 టీమ్ మెంబెర్స్ అంతా కలిసి చరణ్ బర్త్ డేని ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేసి పిక్స్ ని వదిలారు మేకర్స్. రామ్ చరణ్ కేక్ కట్ చేసి తన బర్త్ డే ని ఓ రోజు ముందుగానే RC15టీమ్ తో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నారు.
ఇక రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ రేపు ఈవెనింగ్ నుండే మొద్దలు కాబోతున్నాయి. రేపు ఆదివారం సాయంత్రం 6 గంటలకే RC15 టైటిల్ రివీల్ చేసే ఉద్దేశ్యంలో మేకర్స్ ఉన్నారు. ఇక RC16 బుచ్చి బాబు నుండి కూడా ఏదైనా అప్ డేట్ ఉండొచ్చనే ఊహలో మెగా ఫాన్స్ ఉన్నారు. ఈ అప్ డేట్స్ అన్నిటితో చరణ్ బర్త్ డే సోషల్ మీడియాలో సూపర్బ్ గా ప్లాన్ చేసుకుంటున్నారు ఫాన్స్.