Advertisementt

పాన్ ఇండియా నటుడితో మీనా రెండో పెళ్లి

Sat 25th Mar 2023 06:30 PM
meena,kollywood  పాన్ ఇండియా నటుడితో మీనా రెండో పెళ్లి
Meena second marriage with a Pan India actor పాన్ ఇండియా నటుడితో మీనా రెండో పెళ్లి
Advertisement
Ads by CJ

హీరోయిన్ మీనా రెండో పెళ్లి విషయం గత ఏడాది నుండి సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. మీనా భర్త విద్యా సాగర్ గత ఏడాది జూన్ లో అనారోగ్య కారణాలతో మృతి చెందారు. తన బిడ్డ భవిష్యత్తు కోసం మీనా వెంటనే సినిమా షూటింగ్స్ లోకి వెళ్ళిపోయింది. భర్త మరణ వార్తతో కుంగిపోయినా.. తన బిడ్డ జీవితం ముఖ్యమని ఆమె పనిలో పడిపోయింది. అయితే అప్పటినుండి మీనా రెండో పెళ్లి వార్త బాగా పాపులర్ అయ్యింది. కానీ మీనా మాత్రం రెండో పెళ్లి వార్తలని కొట్టిపారేసింది.

ఇప్పుడు తమిళ నటుడు రంగనాధన్ ఓ తమిళ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనా రెండో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. మీనా త్వరలోనే ఓ తమిళ స్టార్ హీరోని అందులోనూ పాన్ ఇండియా నటుడిని పెళ్లాడబోతుంది. జులై లో మీనా కి ఆ హీరోకి పెళ్లి జరగబోతుంది, ఆ హీరో గత ఏడాది తన భార్యతో విడాకులు తీసుకుని విడిపోయిన పాన్ ఇండియా స్టార్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

అంతేకాకుండా ఆ హీరో మీనా కన్నా చిన్నవాడు, మీనాతో నిశ్చితార్ధానికి కూడా ఆ నటుడు ముహూర్తం పెట్టేసాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ప్రస్తుతం మీనా రెండో పెళ్లిపై నటుడు రంగనాధన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అసలా విడాకులు తీసుకున్న స్టార్ హీరో ఎవరా అనే ఆలోచనలోకి నెటిజెన్స్ వెళుతున్నారు.

Meena second marriage with a Pan India actor:

Is Actress Meena Second Marriage With Tamil Star Hero?

Tags:   MEENA, KOLLYWOOD
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ