టాప్ హీరోయిన్ సమంత గత ఏడాది మయోసిటిస్ వ్యాధి బారిన పడి ఆరు నెలల పాటు పబ్లిక్ లోకి రాకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకుంది. బలహీనత, కండరాల వ్యాధితో సతమతమైన సమంత ఈ సంక్రాంతి సమయంలోనే కోలుకుని కాస్త మాములు మనిషిగా మారింది. కోలుకోవడమే సమంత జిమ్ లో చమటలు చిందించే వర్కౌట్స్ చేస్తూ కష్టపడిపోవడం ఆమె అభిమానాలకే నచ్చలేదు.
ప్రస్తుతం ఖుషి , సిటాడెల్ వెబ్ సీరీస్ షూటింగ్స్ తో పాటుగా.. శాకుంతలం ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. అయినప్పటికీ సమంత నీరసంగానే కనిపిస్తుంది. తాజాగా శాకుంతలం ప్రమోషన్స్ లో సమంత తన హెల్త్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తానిప్పుడే అనారోగ్యం నుండి కోలుకుంటున్నాను, ప్రస్తుతం తన హెల్త్ బాగానే ఉంది, ఇప్పుడిప్పుడే బయట తిరగలుగుతున్నాను అంటూ సుమ ఇంటర్వ్యూలో చెప్పింది.
శకుంతలాగా సమంత నటించిన శాకుంతలం ఏప్రిల్ 14 న విడుదల కాబోతుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న శాకుంతలం ప్రమోషన్స్ లో సమంత చురుగ్గా పాల్గొంటుంది.