శ్రీరామ నవమికి ప్రభాస్ ఆదిపురుష్ నుండి అప్ డేట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభాస్ ఫాన్స్. ఎప్పుడో టీజర్ ఇచ్చి కామ్ అయిన ఆదిపురుష్ టీమ్ మళ్ళీ అలికిడి లేదు. ఓమ్ రౌత్ నిద్ర లే అంటూ ప్రభాస్ ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కనీసం రాముడికి ప్రీతికరమైన రోజు శ్రీరామనవమికి అయినా ఆదిపురుష్ నుండి అప్ డేట్ వస్తే ప్రభాస్ ఫాన్స్ శాంతించేలా ఉన్నారు. కానీ అలాంటి హడావిడేమీ కనిపించడమే లేదు.
వచ్చే గురువారమే శ్రీరామ నవమి. ఆదిపురుష్ నుండి ఫాన్స్ మెచ్చే అప్ డేట్ వస్తే ఓకె.. లేదంటే మేకర్స్ ని ఉతికి ఆరేసేలా ఉన్నారు. ఆదిపురుషుడిగా రాముడిగా ప్రభాస్ ని ఊహించుకున్న ఫాన్స్ కి ఆదిపురుష్ టీజర్ ఇచ్చిన షాక్ నుండి ప్రభాస్ ఫాన్స్ చాలా లేట్ గా కోలుకున్నారు. ఇప్పుడు మంచి లుక్ కానీ, లేదంటే ప్రభాస్ పై స్పెషల్ ప్రోమో కానీ వదిలితే సినిమాపై హైప్ క్రియేట్ అవుతుంది అని ఫాన్స్ ఆరాటం.
కానీ ఆదిపురుష్ మేకర్స్ ఏం ఆలోచిస్తున్నారో ప్రభాస్ ఫాన్స్ ఊహకి అందడం లేదు. దానితో ప్రష్టేషన్ తో సోషల్ మీడియాలో మేకర్స్ ని తిట్టిపోస్తున్నారు. జూన్ 16 ఆదిపురుష్ విడుదల.. అందులోను హాలీవుడ్ లోను ఆదిపురుష్ విడుదల అని చెప్పడం కాదు.. మేకర్స్ నిద్ర లేచి ముందు ప్రమోషన్స్ మొదలు పెట్టమని ప్రభాస్ ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆదిపురుష్ నుండి నవమికి ఏమైనా బ్లాస్టింగ్ అప్ డేట్ ఇస్తే ఓకే.. లేదంటే ఫాన్స్ చేతిలో అయిపోతారు.