మెగా ఫాన్స్ రెడీగా ఉన్నారా.. RC15 స్ట్రోమ్ వచ్చేస్తుంది. రామ్ చరణ్ బర్త్ డే కి మరికొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ బర్త్ డే CDP తోనే హడావిడి చేస్తున్న మెగా ఫాన్స్.. బర్త్ డే రోజున రాబోతున్న RC15 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కోసం ఏడాది కాలంగా వెయిట్ చేస్తున్నారు. మార్చ్ 27 రామ్ చరణ్ బర్త్ డే. మార్చి 26 సాయంత్రం 6 గంటలకే RC15 సర్ ప్రైజ్ రాబోతుంది అని తెలుస్తుంది. ఇప్పటికే అమెరికాలో రామ్ చరణ్ చేసిన హడావిడికి మెగా ఫాన్స్ థ్రిల్ అయ్యి ఉన్నారు.
ఇప్పుడు RC15 టైటిల్ రాబోతుంది. రామ్ చరణ్ లుక్ రాబోతుంది. ఇక మెగా ఫాన్స్ అస్సలాగరు.. సోషల్ మీడియాలో రామ్ చరణ్ హాష్ టాగ్ తో ట్రెండ్ చేసేందుకు సిద్ధమైపోయారు. ఇప్పటికే రామ్ చరణ్ ఆరెంజ్ స్పెషల్ షోస్ తో రచ్చ మొదలెట్టారు మెగా ఫాన్స్. ఇప్పుడు RC15 హడావిడి మొదలవుతుంది. ప్రస్తుతం #RC15 కోసం శంషాబాద్ దగ్గర భారీ స్టేడియం సెట్ వేసి అక్కడ షూటింగ్ చిత్రీకరణ చేపట్టినట్లుగా తెలుస్తుంది. ఇక రేపు RC15 టైటిల్ గా CEO ని ప్రకటించనున్నట్లుగా తెలుస్తుంది. మూడు లాంగ్వేజెస్ కి ఈ టైటిల్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటున్నారు.
అలాగే రిలీజ్ డేట్ కూడా ఈ టైటిల్, అండ్ లుక్ తోనే ఇచ్చేస్తారనే ప్రచారమూ జరుగుతుంది. ప్రస్తుతం RC15 హీరోయిన్ కియారా అద్వానీ హైదరాబాద్ లోనే ఉంది. ఆమె షూటింగ్ కోసం ఇక్కడే స్టే చేసింది. ఇప్పుడు చరణ్-కియారాలపై కాంబో సీన్స్ ని శంకర్ చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తుంది.