నిన్న ఫ్రైడే మీడియాలో మంచు ఫ్యామిలీపై ఒకటే వార్తలు. అవేమి కావాలని మీడియా సృష్టించినవి కాదు, వాళ్ళని పనిగట్టుకుని ట్రోల్ చేసినవి అంతకన్నా కావు.. మంచు ఫ్యామిలిలో విష్ణు-మనోజ్ ల దెబ్బలాట సోషల్ మీడియాలో పెద్ద రచ్చ అయ్యింది. మా మీద ఏం కావాలంటే అది రాసుకుని హ్యాపీగా ఉండండి అనే మోహన్ బాబు సైతం సైలెంట్ గా ఉండేలా చేసిన ఘటన మంచు ఫ్యామిలిలో జరిగింది. వాళ్ళ పరువును వాళ్ళే రోడ్డుకీడ్చుకున్నారు. ఇంట్లో పరిష్కరించుకోవాల్సిన సమస్య బజారుకెక్కించారు.
విష్ణు-మనోజ్ మధ్యన ఆస్తి తగువులు ఉన్నాయేమో కానీ.. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి కొట్టుకునేది ఒక్కటే మిగిలింది అన్నట్టుగా విభేదాలు రాజుకున్నాయి. మనోజ్ తన అన్న విష్ణు ని బ్యాడ్ చేస్తూ షేర్ చేసిన వీడియో మీడియాలో సంచలనమైంది. విష్ణు తన మనుషులపై దౌర్జన్యం చేస్తున్నాడు, నా వాళ్లపై బంధువులపై కొంతకాలంగా విష్ణు ఇలా చేస్తున్నాడంటూ మనోజ్ పెట్టిన వీడియో మంచు ఫ్యామిలీ పరువు తీసింది. తర్వాత ఈ గొడవపై మంచు మోహన్ బాబు ఇది అన్న దమ్ముల మద్యం చిన్న సమస్య.. పరిష్కారానికి ఎంతో సేపు పట్టదు, ఇంక దీనిని వదిలేయండి, పెద్దది చెయ్యకండి అన్నారు.
విష్ణు అయితే మా తమ్ముడు చిన్నవాడు తెలియక చేసాడు, చిన్న గొడవే అన్నాడు. మంచు లక్ష్మి ఈ విషయమై తనకేమి తెలీదనేసింది. తాజాగా మంచు లక్ష్మి మంచు విష్ణు-మనోజ్ ల విషయమై సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఇది ప్రతి ఇంట్లో జరిగే అన్నదమ్ముల గొడవగానే చూడాలి, దీనిపై అనవసరంగా రచ్చ చెయ్యొద్దు, ఈ గొడవ త్వరలోనే పరిష్కారం అవుతుంది. విషయం తెలియకుండా దీనిని పెద్దది చేసి రాయొద్దు, ఏదేదో రాసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అంటూ విన్నవించుకుంది.