నిన్న శుక్రవారం మంచు వారి పరువు మంట గలిసిపోయేలా మంచు విష్ణు-మంచు మనోజ్ లు ఇద్దరూ ప్రవర్తించారు. మీడియా మొత్తం మంచు ఫ్యామిలీని కవర్ చేసింది. మంచు మనోజ్.. అన్న విష్ణు చేసిన దౌర్జన్యాన్ని సోషల్ మీడియాలో పెట్టేసాడు. తండ్రితో చెప్పి పరిష్కరించుకోవాల్సిన సమస్యని నెట్టింట్లో పెట్టడంతో మంచు వారి పరువు బజారున పడింది. మోహన్ బాబు కొడుకులిద్దరిని కంట్రోల్ చెయ్యలేక మీడియాతో మీరు పెద్దది చెయ్యకండి అని చెప్పారు.
మంచు విష్ణు తన అనుచరులు, బంధువులపై దౌర్జన్యం చేస్తున్నాడంటూ విష్ణు గొడవపడుతున్న వీడియో మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేయగానే అది వైరల్ అయ్యింది. ఆతర్వాత మోహన్ బాబు అన్నదమ్ముల మధ్యన చిన్న చిన్న అభిప్రాయ భేదాలు.. అవేమి పెద్దవి కావు, లైట్ తీసుకోండి అంటే.. మంచు విష్ణు నా తమ్ముడు చిన్నవాడు, తనకేమి తెలియదు, అది పెద్ద విషయమే కాదు అన్నాడు. ఇక మంచు లక్ష్మి అసలు ఈ గొడవ గురించి తనకేమి తెలియదు అంటూ మీడియా నుండి తప్పించుకుంది. అ తర్వాత మనోజ్ పెళ్ళికి సంబందించిన పార్టీ ఫ్రెండ్స్ తో కలిసి తన ఇంట్లోనే సెలెబ్రేట్ చేసుకుంది.
అయితే ఇంత గొడవకి కారణమైన మనోజ్ మాత్రం ఈ విషయమై స్పందించలేదు. అసలు నాకు దానితో సంబంధమే లేనట్టు అజిత్ ఫాదర్ సుబ్రహ్మణ్యన్ నిన్న కన్ను మూసిన విషయంపై ట్వీట్ చేస్తూ అజిత్ కి సానుభూతి తెలియజేసాడు. అసలు మంచు ఫ్యామిలీ విభేదాలను రచ్చ కీడ్చిన మనోజ్ ఆ విషయంలో సైలెంట్ గా ఉండి.. అజిత్ తండ్రి మరణానికి సానుభూతి తెలపడం అందరికి షాకిచ్చింది.