ఈరోజు మీడియాలో మంచు విష్ణు-మంచు మనోజ్ ల మధ్యన ఎప్పటినుండో నిగురుగప్పిన విభేదాలు నేడు మనోజ్ చేసిన ఓ పనితో రోడ్డున పడ్డాయి, మంచు వారి పరువు మొత్తం విష్ణు-మనోజ్ లు గంగలో కలిపేశారు. అందరి దగ్గరికి వెళ్లి పెద్దమనిషిలా పంచాయితీ చెప్పే మోహన్ బాబు ఇంట ఇంత పెద్ద రచ్చ జరగడం చూసి అయ్యో పాపం అనని వారే లేరు. అంతలా మోహన్ బాబు ఫ్యామిలీ వ్యవహారాలు అందరి నోళ్ళలోకి వెళ్లిపోయాయి.
మనోజ్.. తన అనుచరులపై విష్ణు దాడి చేసే దృశ్యాలని సోషల్ మీడియాకి ఎక్కించాడు. దానితో మంచు ఫ్యామిలీ గొడవలు అందరికి తెలిసిపోయాయి. మోహన్ బాబు చక్కదిద్దేసరికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. మంచు విష్ణు మా తమ్ముడు చిన్నవాడు, వాడికి ఏమి తెలియదని కవర్ చేసినా.. వారి మధ్యన అగ్గి ఎంతగా రాజుకుందో అర్ధమైంది. ఇంతజరిగి ఛానల్స్ లో మంచు ఫ్యామిలీ నానిపోతుంటే.. మంచు లక్ష్మి మాత్రం తన ఇంట్లో మనోజ్ పెళ్లి సందర్భంగా ఫ్రెండ్స్ ని పిలిచి విందు ఏర్పాట్లు చెయ్యడం అందరికి షాకిచ్చింది.
ఈ గొడవ జరిగాక ఛానల్స్ అన్నీ మంచు లక్ష్మి ఇంటి ముందు కాపు కాచాయి.. అప్పుడే కారులో ఇంటికి వస్తున్న లక్ష్మీని ఈ గొడవ గురించి వీడియో గురించి అడగగా.. నాకేమి తెలియదు అంది. నేనేదో మనోజ్ పెళ్లి పార్టీ ఇస్తుంటే.. గెస్ట్ లు వస్తుంటే మీరేమిటి ఇక్కడ అంటూ సైలెంట్ గా ఇంట్లోకి వెళ్లిపోగా.. లక్ష్మి తన ఇంట్లో ఇచ్చిన మనోజ్ పెళ్లి విందు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మరింది.
అన్నదమ్ములిద్దరూ ఇంతగా గొడవ పడుతుంటే.. లక్ష్మీ ఏమిటి భయ్యా కూల్ గా ఇంట్లో పార్టీ ఏర్పాట్లు చేసి.. చికెన్, మటన్, ప్రాన్స్ అంటూ ప్లేట్ చూపిస్తుంది అంటూ నెటిజెన్స్ విస్తుపోతున్నారు.