Advertisementt

రోడ్డెక్కిన మంచు హీరోల గొడవలు

Fri 24th Mar 2023 12:35 PM
manchu manoj,manchu vishnu   రోడ్డెక్కిన మంచు హీరోల గొడవలు
Manchu Vishnu vs Manchu Manoj రోడ్డెక్కిన మంచు హీరోల గొడవలు
Advertisement
Ads by CJ

మోహన్ బాబు ఇద్దరికీ రాజి కుదర్చలేక మనోజ్ పెళ్లి ఒప్పుకోలేక సతమతమవుతూ.. మనోజ్ పెళ్లి తన ఇంట్లో కాకుండా తన కూతురు లక్ష్మి ఇంట్లో నిర్వహించారు.. ఈ పెళ్ళికి మంచు విష్ణు ఏదో చుట్టం చూపుగా వచ్చి అక్షింతలు వేసి వెళ్లిపోయాడంటూ చాలారకాల వార్తలు గత నెలరోజులుగా సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. విష్ణు భార్య మంచు మనోజ్ పెళ్లి వేడుకల్లో కనిపించినా విష్ణు కనిపించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేసారు చాలామంది.

ఇక మోహన్ బాబు బర్త్ డే వేడుకల్లో మంచు విష్ణు-మంచు మనోజ్ లు తండ్రిని దగ్గరుండి స్టేజ్ ఎక్కించినా వారి మధ్యన ఒక పలకరింపు, నవ్వు లేకపోవడం అందరి దృష్టి నుండి పక్కకి పోలేదు. తాజాగా అన్నదమ్ముల గొడవలు రోడ్డెక్కాయి. మంచు మనోజ్ ఈ రోజు సోషల్ మీడియా ఇన్స్టా స్టోరీస్ లో ఓ వీడియో పెట్టాడు. విష్ణు తన అనుచరుల ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం చేశాడంటూ ఓ వీడియోని షేర్ చేసాడు. ఆ వీడియోలో మంచు విష్ణు మనోజ్ ఫ్రెండ్ సారధి ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం చేస్తున్నాడంటూ మనోజ్ చెప్పాడు.

సారధిపై దౌర్జన్యం చేసాడు విష్ణు అంటూ మనోజ్ ఆ వీడియో తో పాటుగా.. ఇది పరిస్థితి, కొంతకాలంగా మా వాళ్లపై, బంధువులపై విష్ణు ఇలా దౌర్జన్యం చేస్తున్నాడంటూ ఆ వీడియోని షేర్ చేసాడు. అయితే అది షేర్ చేసిన కొద్దిసేపటికే దానిని మనోజ్ ఇన్స్టా స్టోరీస్ నుండి తొలగించాడు. కానీ ఆ వీడియో అప్పటికే వైరలయ్యింది.

Manchu Vishnu vs Manchu Manoj:

Manchu Manoj accuses brother Vishnu of physical assaults

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ