Advertisementt

ఇప్పటివరకు ఎన్టీఆర్-చరణ్ ఫ్రెండ్స్.. ఇకపై..!

Fri 24th Mar 2023 11:06 AM
ram charan,ntr  ఇప్పటివరకు ఎన్టీఆర్-చరణ్ ఫ్రెండ్స్.. ఇకపై..!
Ram Charan vs NTR ఇప్పటివరకు ఎన్టీఆర్-చరణ్ ఫ్రెండ్స్.. ఇకపై..!
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ ఇద్దరూ కొన్నేళ్లుగా ఫ్రెండ్స్ అయినప్పటికీ.. ఆర్.ఆర్.ఆర్ తర్వాతే వారి ఫ్రెండ్ షిప్ ఎక్స్పోజ్ అయ్యింది. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ మధ్యన అంత స్నేహం ఉంది అని ఎవరికీ తెలియదు. కానీ ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో రామ్ చరణ్-ఎన్టీఆర్ కలిసి స్టేజ్ లపై చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇద్దరు స్టార్ హీరోలు ఇంతిలాంటి ఫ్రెండ్ షిప్ మెయింటింగ్ చేస్తారా అనుకునేంతగా స్నేహాన్ని చూపించారు. నిన్నమొన్నటి ఆస్కార్ వరకు అదే ఫ్రెండ్ షిప్ మీడియాలో హైలెట్ అయ్యింది.

అయితే ఇప్పటివరకు అంత ఫ్రెండ్లి గా కనబడిన రామ్ చరణ్-ఎన్టీఆర్ లు ఇకపై బాక్సాఫీసు దగ్గర పోటీకి సై అంటారు. అంటే శత్రువులుగా మారకపోయినా.. ఓరికొకరు కాంపిటేటర్స్ గా ఫీలవుతారు. రామ్ చరణ్ RC15 తో శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నాడు. అది వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఇక ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో పాన్ ఇండియా ఫిల్మ్ రీసెంట్ గానే మొదలయ్యింది. ఇది ఏప్రిల్ 5 2023 విడుదలకాబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

మరి ఇప్పుడు స్నేహితులు ఇద్దరూ తమ తమ ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతున్నారు. ఇకపై ఎన్టీఆర్-రామ్ చరణ్ స్నేహాన్ని మళ్ళీ ఎప్పుడు చూస్తామో అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ మాత్రం ఇకపై మా హీరో గొప్ప అంటే మా హీరో టాప్ అనేందుకు రెడీ అవుతున్నారు. 

Ram Charan vs NTR:

Mega fans vs NTR fans

Tags:   RAM CHARAN, NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ