సుడిగాలి సుధీర్ పేరు బుల్లితెర మీద వినబడి చాలాకాలమైంది. జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ స్కిట్స్ తో సందడి తో చెయ్యడమే కాదు.. ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ లో కామెడీ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులని మెస్మరైజ్ చేసేవాడు. కానీ గత ఏడాది జబర్దస్త్ కి బ్రేకిచ్చి స్టార్ మా లో తేలాడు. ఆ తర్వాత అటు జబర్దస్త్ లేదు.. వేరే ఛానల్స్ లో కనిపించడం లేదు. కేవలం సినిమా షూటింగ్స్ చేసుకుంటూ వెండితెర మీద అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడు. సోలో హీరోగా, తన ఫ్రెండ్స్ కలిసి సినిమాల్లో నటిస్తున్నాడు.
అంతేకాదు స్టార్ హీరోల సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను మారిన సుధీర్ సాఫ్ట్ వేర్ సుధీర్ తో హీరోగా మారాడు. ఆ తర్వాత గాలోడు సినిమా రిలీజ్ చేసాడు. ఆ సినిమా టాక్ తో సంబంధం లేకుండా సూపర్ హిట్ కలెక్షన్స్ సాధించడంతో సుధీర్ పై అంచనాలు పెరిగాయి. ఇంకా అతను నటించిన కాలింగ్ సహస్ర విడుదలకు రెడీ అవుతుంది. ప్రస్తుతం బుల్లితెర కి బ్రేకిచ్చి సిల్వర్ స్క్రీన్ మీద దూసుకుపోతున్నాడు.
ఉగాది సందర్భంగా సుడిగాలి సుధీర్ SS4 త్వరలోనే అనౌన్సమెంట్ రాబోతున్నట్టుగా అప్ డేట్ ఇచ్చాడు. అంటే సుడిగాలి సుధీర్ నాలుగో ప్రాజెక్ట్ పై త్వరలోనే అప్ డేట్ ఇవ్వబోతున్నట్లుగా చెప్పాడు. సుడిగాలి పేరు సార్ధకం చేస్తూ నిజంగానే వెండితెర మీద సుడిగాలి మాదిరి దూసుకుపోతున్నాడు. ఇక సిల్వర్ స్క్రీన్ పై బిజీ అయితే బుల్లితెరపై సుధీర్ కనిపించకపోయినా ఆశ్చర్యం లేదు. మరి నాలుగో ప్రాజెక్ట్ ఏ దర్శకుడితో, ఏ బ్యానర్ లో చెయ్యబోతున్నాడో అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంచాడు.