Advertisementt

బ్రహ్మీని సత్కరించిన చిరు-చరణ్

Thu 23rd Mar 2023 06:20 PM
chiranjeevi,ram charan,brahmanandam  బ్రహ్మీని సత్కరించిన చిరు-చరణ్
Chiru, Charan praise Brahmanandam moving performance బ్రహ్మీని సత్కరించిన చిరు-చరణ్
Advertisement
Ads by CJ

ఒకప్పుడు స్టార్ హీరోలైనా, సీనియర్ హీరోలైనా తమ సినిమాల్లో బ్రహ్మనందం హాస్యం లేకుండా అస్సలు సినిమా చేసేవారు కాదు, హీరోలతో సమానమైన కేరెక్టర్స్ లో అప్పట్లో బ్రహ్మీ ప్రేక్షకులని మెస్మరైజ్ చేసారు. కొద్దిరోజులుగా బ్రహ్మానందం కి సరైన కేరెక్టర్ దొరకడమే లేదు. అసలాయన సినిమాలనుండి బ్రేక్ తీసుకోబోతున్నారనే అనుమానాలు కలిగాయి. కానీ ఇప్పుడు బ్రహ్మానందం మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసారు. జాతి రత్నాలలో గెస్ట్ రోల్ చేసిన ఆయన పంచతంత్రంలో ఫుల్ లెంత్ రోల్ చేసారు. 

ఇప్పుడు కృష్ణవంశీ దర్శకత్వంలో కామెడీ పాత్ర కాకుండా సీరియస్ పాత్రలో అద్భుతమైన నటనతో అదరగొట్టేసారు. మెగాస్టార్ చిరంజీవికి బ్రహ్మానందం అంటే ప్రత్యేమైన అభిమానం. ఆయన పుట్టినరోజులకి బ్రహ్మీ ఇంటికి వెళ్లి మరీ విష్ చేస్తూ ఉంటారు. ఉగాది సందర్భంగా థియేటర్స్ లో విడుదలైన రంగమార్తాండ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రాగా.. అందులో బ్రహ్మీ కేరెక్టర్ పై అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడూ కామెడీతో నవ్వించే ఆయన ఇప్పుడు ఏడిపించేసారు అంటూ ఆయనని పొగిడేస్తున్నారు. 

అయితే రంగమార్తాండలో బ్రహ్మీ నటనను పోగుడుతూ మెగాస్టార్ చిరు ఆయన కొడుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి సత్కరించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బ్రహ్మానందాన్ని అభిమానించే మెగాస్టార్ అయన ఇంటికి వెళ్లి మరీ చరణ్ తో కలిసి ఆయనకి శాలువా కప్పి సత్కరించారు. 

Chiru, Charan praise Brahmanandam moving performance:

Chiranjeevi, Ram Charan praise Brahmanandam moving performance

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ