హీరో సిద్దార్థ్ తో అదితి రావు హైదరి ఎప్పటినుండో డేటింగ్ లో ఉంది. సిద్ధుకి, అదితికి వేర్వేరు వివాహాలయినా.. ప్రస్తుతం వాళ్లతో విడాకులు తీసుకుని విడిపోవడంతో.. ఎవరి కేరీర్లో వారు బిజీగా వున్న సమయంలో మహాసముద్రం సినిమా షూటింగ్ అప్పటినుండి వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు, రెస్టారెంట్ కి వెళ్ళినా, మారేదన్నా ప్లేస్ కి వెళ్ళినా గతంలో సీక్రెట్ ని మెయింటింగ్ చేసే ఈ జంట ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు. కానీ ఈ విషయంలో అదితి మాత్రం మీడియాకి కర్ర విరక్కుండా, పాము చావకుండా అన్న సామెత టైప్ లో సమాధానమిస్తుంది.
మొన్నామధ్యన నా పర్సనల్ విషయాలను పక్కనబెట్టండి.. ముందు నా కెరీర్ గురించి మాట్లాడుకుందాము, నేను ప్రస్తుతం షూటింగ్స్ తో బిజీగా వున్నాను, వాటి గురించి అడగండి చెబుతాను అంది, ఇక తాజాగా ఆమె నటించిన తాజ్ విడుదలైన సందర్భంగా అదితి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఆమెకి సిద్దార్థ్ ప్రేమపై ప్రశ్న ఎదురైంది. దానికి అదితి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఏదో ఒకదానిపై ఆసక్తి ఉంటుంది. కొంతమందికి ఇలాంటి వాటిపై ఉండొచ్చు.
కానీ చాలామందికి మమ్మల్ని స్క్రీన్ పై చూడడమంటే ఇష్టం. అందుకు అనుగుణం మేము మరింత కష్టపడాలి. మా వర్క్ ని ప్రేమించాలి, ఆలా చేసిఅనప్పుడే మేము మీకు మంచి కంటెంట్ ని అందించగలుగుతాము.. అని చెప్పిన అదితి.. సిద్దార్థ్ తో డేటింగ్ ప్రశ్నపై మాత్రం కాస్త అసహనంగానే కనిపించింది. ఆ విషయంలో మీకే ఒక అభిప్రాయం ఉంది, నేను ఏమి చెప్పినా.. మీకు నచ్చిందే ఊహించుకుంటారు అంది. కానీ యాంకర్ మాత్రం ఇది మా ప్రశ్న కాదు.. ఆడియన్స్ ప్రశ్న అని అడగగా.. దానికి ఆమె.. వారు నన్నెప్పుడు అలా అడగలేదు.. ఇది మీరు మాత్రమే అడుగుతున్నారంటూ సరదాగా నవ్వేసింది.