ఎప్పటినుండో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సౌత్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ ప్రచారం జరగడమే కానీ. జాన్వీ మాత్రం సౌత్ లోకి రాలేదు. అయితే ఇప్పుడు ఆమె యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీతో సౌత్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఎప్పుడూ గ్లామర్ డాల్ లానే కనిపించే జాన్వీ కపూర్ అందాలు ఆరబోసే విషయంలో వెనక్కి తగ్గదు. ఆమె ఇప్పటివరకు నటన పరంగా కన్నా గ్లామర్ విషయంలోనే హైలెట్ అయ్యింది.
ఇక ఎన్టీఆర్ తో సౌత్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఉత్సాహం చూపించిన జాన్వీ కపూర్ NTR30 ఓపెనింగుకి ఎంత హడావిడి చేస్తుందో అనుకుంటే జాన్వీ కపూర్ చాలా సింపుల్ గా సారీ లో ఎంట్రీ ఇచ్చేసింది. అంటే గ్లామర్ విషయంలో జాన్వీ కపూర్ గురించి మాట్లాడుకునేలా చేస్తుందేమో అనుకున్నారు. అదేమీ లేకుండానే జాన్వీ కపూర్ చిలకపచ్చ పట్టు చీరలో లూజ్ హైర్ తో, సింపుల్ జుంకాస్ తో NTR30 ఓపెనింగ్ వేడుకలో మెరిసింది.
అయితే జాన్వీ కపూర్ NTR30 ఓపెనింగ్ వీడియో లో చాలా క్యూట్ గా కనిపించింది. ఎన్టీఆర్ తో మాట్లాడుతున్నప్పుడు జాన్వీ కపూర్ కళ్ళలో మెరుపు కనిపించింది. రాజమౌళితోనూ ఆమె చక్కగా మాట్లాడిన వీడియోస్ వైరల్ గా మారాయి. సో ఇకపై జాన్వీ కపూర్ తరచుగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో దర్శనమివ్వబోతుందన్నమాట.