Advertisementt

NTR30 బ్యాక్ డ్రాప్ రివీల్డ్

Thu 23rd Mar 2023 11:20 AM
koratala siva,ntr 30  NTR30 బ్యాక్ డ్రాప్ రివీల్డ్
NTR30 BackDrop Revealed NTR30 బ్యాక్ డ్రాప్ రివీల్డ్
Advertisement
Ads by CJ

కొరటాల శివ-ఎన్టీఆర్ కలయికలో రెండో మూవీగా తెరకెక్కబోతున్న NTR30 పూజా కార్యక్రమాలు నేడు గురువారం ఉదయం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగాయి. ఎన్టీఆర్-హీరోయిన్ జాన్వీ కపూర్ పై మొదటి షాట్ కి రాజమౌళి క్లాప్ ఇవ్వగా.. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కెమరా స్విచ్ ఆన్ చేసారు. తర్వాత కొరటాల శివ తన టీమ్ ని పరిచయం చేస్తూ NTR30 బ్యాక్డ్రాప్ రివీల్ చేసారు. తాను గ్రేట్ యాక్టర్ ఎన్టీఆర్ తో చేస్తున్న రెండో సినిమా ఇది అని అన్న ఆయన NTR30 నేపథ్యం గురించి మట్లాడుతూ.. ఈ కథలో మనుషుల కంటే మృగాలు ఎక్కువగా ఉంటారు. 

దేవుడు అంటే భయం లేదు, చావు అంటే భయం ఉండదు. కానీ ఒక్కటి అంటేనే భయం ఉంటుంది. అది ఏమిటో మీకు తెలుసు. సముద్రం వంటి కోస్తా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో దేవుడికి, మరణానికి భయపడని అడవి స్వభావం గల వ్యక్తులు కీలకపాత్ర పోషిస్తారని.. ఎన్టీఆర్ వారిని ఎందుకు, ఎలా భయపెట్టాడు అనేది ఎమోషనల్ రైడ్ గా ఈ చిత్రం ఊర మాస్ గా ఉండబోతున్నట్లుగా కొరటాల రివీల్ చేసేసారు.

ఈ సినిమా తన కెరీర్ బెస్ట్ అవుతుంది అని ప్రేక్షకులకు, అభిమానులకు మాటిచ్చారు. ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా సౌత్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్ర ఓపెనింగ్ లో జాన్వీ కపూర్ సందడి చేసింది. వీఎఫ్‌ఎక్స్‌తో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించడంతో ఎన్టీఆర్ 30 సంవత్సరానికి పైగా ప్రీ ప్రొడక్షన్‌లో ఉంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు కెమెరా మ్యాన్ గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా, సాబు సిరిల్  డిజైనర్ గా పని చేస్తున్నారు.

NTR30 BackDrop Revealed:

Koratala Siva reveals the backdrop of NTR 30

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ