Advertisementt

రశ్మిక అంటే అంత సెంటిమెంట్ ఏంటి వెంకీ !

Thu 23rd Mar 2023 10:42 AM
venky kudumula,nithiin,rashmika mandanna  రశ్మిక అంటే అంత సెంటిమెంట్ ఏంటి వెంకీ !
Venky Kudumula again repeat Rashmika in his next movie రశ్మిక అంటే అంత సెంటిమెంట్ ఏంటి వెంకీ !
Advertisement
Ads by CJ

కొంతమంది దర్శకులు హీరోయిన్స్ ని పదే పదే రిపీట్ చేస్తూ ఉంటారు. రాజమౌళి, త్రివిక్రమ్ ఇలా చాలామంది దర్శకులు హీరోయిన్స్ ని రిపీట్ చేస్తుంటారు. ఇప్పుడు యువ దర్శకుడు తాను తీసింది రెండు సినిమాలు. అందులో ఆ రెండుసార్లు ఒకటే హీరోయిన్. ఇప్పుడు మూడో సినిమాని ప్రకటించాడు. అందులోనూ అదే హీరోయిన్ ని కంటిన్యూ చేస్తున్నాడు. అంటే అది సెంటిమెంట్ అనుకోవాలా.. మరేదన్నా అనుకోవాలా అనే అనుమానాలు నెటిజెన్స్ నుండి వ్యక్తమవుతున్నాయి.

ఆ హీరోయిన్ ఎవరో కాదు రష్మిక, ఆ దర్శకుడు వెంకీ కుడుముల. కన్నడ నుండి తన మొదటి సినిమా ఛలో కోసం తీసుకొచ్చిన రశ్మికని.. తదుపరి సినిమా భీష్మలోను కంటిన్యూ చేసాడు. నాగ శౌర్య తో ఛలోతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక తర్వాత టాలీవుడ్ లో టాప్ పొజిషన్ కి దగ్గరైంది. పుష్ప పాన్ ఇండియా ఫిల్మ్, బాలీవుడ్, కోలీవుడ్ అబ్బో రష్మిక మాములుగా బిజీ అవ్వలేదు. ఇక నితిన్ తో చేసిన భీష్మలోను రశ్మికనే వెంకీ హీరోయిన్ గా రిపీట్ చేసాడు. అది పెద్ద హిట్ అయ్యింది.

తర్వాత వెంకీ కుడుముల మెగాస్టార్ ని డైరెక్ట్ చేస్తాడు అనుకుంటే.. మరోసారి నితిన్ తోనే తదుపరి ప్రాజెక్ట్ ప్రకటించాడు. ఇందులోనూ రశ్మికనే పెడుతుండడంతో.. హీరోయిన్స్ దొరకడం లేదా.. లేదంటే రశ్మిక అంటే అంత సెంటిమెంట్ ఉందా అనే అనుమానం అందరిలో మొదలయ్యింది. నితిన్ అంటే హీరోగా ఓకె.. మళ్ళీ రశ్మికనే హీరోయిన్ గా తీసుకోవడంలో ఆంతర్యం అర్ధం కాక జుట్టుపీక్కుంటున్నారు నెటిజెన్స్. అసలు మరి వెంకీ కుడుములు మనసులో ఏముందో కదా.!

Venky Kudumula again repeat Rashmika in his next movie:

Venky Kudumula, Nithiin, Rashmika Mandanna team up once again

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ