Advertisementt

ఎన్టీఆర్-జాన్వీ పై మొదటి క్లాప్

Thu 23rd Mar 2023 10:01 AM
ntr30   ఎన్టీఆర్-జాన్వీ పై మొదటి క్లాప్
NTR30 Grand Launch ఎన్టీఆర్-జాన్వీ పై మొదటి క్లాప్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్-కొరటాల కాంబోలో తెరకెక్కబోయే NTR30 మూవీ ఓపెనింగ్ ఈ రోజు గురువారం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగిపోయింది. ఎన్టీఆర్ ఫాన్స్ ఆత్రుత పడినంతసేపు లేదు.. ఈ పూజా కార్యక్రమాలు అన్నట్టుగా NTR30 ఓపెనింగ్ కార్యక్రమాలు ఈరోజు ఉదయం 8.30 నిమిషాలకి మొదలై 9.15 నిమిషాలకల్లా పూర్తయిపోయింది. ఈ ఓపెనింగ్ లో టాలీవుడ్ కి ఆస్కార్ అందించి తెలుగు సినిమాని ప్రపంచ పటంలో నిలబెట్టిన రాజమౌళి, పాన్ ఇండియా దర్శకుడు ప్రశాంత్ నీల్, దిల్ రాజు లాంటి బిగ్ షాట్స్ పాల్గొన్నారు. ఈ ఓపెనింగ్ లో NTR30 హీరోయిన్ జాన్వీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

ఈ చిత్రానికి పని చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్, నిర్మాత కళ్యాణ్ రామ్, యువ సుధా ఆర్ట్స్ నిర్మాతలు, ఇంకా నిర్మాత నాగ వంశీ ఇలా చాలామంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్టీఆర్-జాన్వీ కపూర్ లపై రాజమౌళి ఓపెనింగ్ షాట్ కి క్లాప్ కొట్టారు. ఆ తర్వాత ఎన్టీఆర్, జాన్వీ, కొరటాల, రాజమౌళి అందరూ గ్రూప్ ఫొటోలకి ఫోజులిచ్చారు. ఓపెనింగ్ కార్యక్రమం పూర్తికాగానే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ప్రశాంత్ నీల్, రాజమౌళి అక్కడినుండి వెళ్లిపోయారు. 

నేడు పూజా కార్యక్రమాలతో ఎంతో గ్రాండ్ గా మొదలైన NTR30 ఈ నెల 29 నుండి రెగ్యులర్ షూట్ కి వెళ్లబోతుంది. హైదరాబాద్ లోనే వేసిన స్పెషల్ సముద్రం సెట్ లో ఎన్టీఆర్ పై యాక్షన్ సన్నివేశాలు కొరటాల చిత్రీకరించబోతున్నట్టుగా తెలుస్తుంది.

NTR30 Grand Launch:

NTR30 launched in the presence of top celebrities

Tags:   NTR30
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ