Advertisementt

మహేష్ వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయ్

Wed 22nd Mar 2023 07:18 PM
mahesh babu,ssmb28  మహేష్ వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయ్
Mahesh Babu to avoid a clash with Megastar? మహేష్ వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయ్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 షూటింగ్ లో పాల్గొంటున్నారు. SSMB28 షూటింగ్ మొదలయ్యాక పలు కారణాలతో ఆ సినిమా షూటింగ్ వాయిదా పడడంతో.. మహేష్ ఇప్పుడు SSMB28 షూటింగ్ లో గ్యాప్ లేకుండా పాల్గొంటున్నారు. ఆఖరికి ఈసారి ఫ్యామిలీ వెకేషన్స్ కూడా త్యాగం చేసేసారు. అయితే మహేష్-త్రివిక్రమ్ చిత్రాన్ని ఆగష్టు 11న విడుదల చేస్తామని నిర్మాత నాగ వంశీ చెప్పారు. కానీ ఇప్పుడు ఆగస్టు 11 న త్రివిక్రమ్-మహేష్ చిత్రం విడుదలయ్యే సూచనలు కనిపించడం లేదు.

ఈరోజు ఉగాది సందర్భంగా మహేష్ SSMB28 లుక్ వస్తుంది అని మహేష్ ఫాన్స్ ఆశపడడమే కాదు, సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టడంతో SSMB28 మేకర్స్ రియాక్ట్ అవుతూ మంచి సమయం చూసి మహేష్ మాస్ ఫీస్ట్ ఇస్తాము.. అప్పటివరకు కంగారు పడవద్దని వాళ్ళని కూల్ చేసారు. అయితే షూటింగ్ మొదలు పెట్టిన కొద్దిరోజులకే లుక్ రివీల్ చేస్తే.. ఎక్కడ హైప్ తగ్గుతుందో అని భయపడిన త్రివిక్రమ్ ఈ ఉగాదికి ఎలాంటి టైటిల్ కానీ, లుక్ కానీ ఇవ్వకుండా లైట్ తీసుకున్నారు. అదే ఆగష్టులో విడుదలయ్యే సినిమా అయితే ఖచ్చితంగా ఈ ఉగాది నుండే ప్రమోషన్స్ మొదలు పెట్టేవారు.

కానీ ఆగష్టు 11న SSMB28 విడుదల సాధ్యమయ్యే పరిస్థితి ఉండకపోవచ్చనే అనుమానం మొదలయ్యింది. అందులో AK ఎంటర్టైన్మెంట్ వాళ్ళు మెగాస్టార్ భోళా శంకర్ ని ఆగష్టు 11 కి ఫిక్స్ చేసారు. అంటే మహేష్ మేకర్స్ తో వాళ్ళు మాట్లాడకుండానే ఈ నిర్ణయమైతే తీసుకోరు కదా అనేది చాలామంది అభిప్రాయం. మహేష్-త్రివిక్రమ్ ఆ డేట్ కి రాను అంటేనే.. చిరు బాక్సాఫీసు బరిలోకి వస్తున్నారేమో అంటున్నారు. ఏది ఏమైనా మహేష్ మాత్రం వెనక్కి తగ్గే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నట్టు.. మెగాస్టార్ భోళా శంకర్ తో బాటు అదే ఆగస్ట్ 11న సూపర్ స్టార్ రజనీ జైలర్ కూడా వస్తోందట.!

Mahesh Babu to avoid a clash with Megastar?:

Bhola Shankar release date is out, will SSMB28 be postponed?

Tags:   MAHESH BABU, SSMB28
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ