Advertisementt

కన్ ఫర్మ్: నితిన్-రష్మిక-వెంకీ కాంబో

Wed 22nd Mar 2023 04:54 PM
nithiin,rashmika  కన్ ఫర్మ్: నితిన్-రష్మిక-వెంకీ కాంబో
Bheeshma Combo To Reunite Once Again కన్ ఫర్మ్: నితిన్-రష్మిక-వెంకీ కాంబో
Advertisement
Ads by CJ

వెంకీ కుడుముల తన దర్శకత్వంలో నితిన్-రష్మిక జంటగా 2020 లో భీష్మ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. భీష్మ చిత్రం తర్వాత నితిన్, రష్మిక తమ కెరీర్ లో బిజీ కాగా.. వెంకీ కుడుములు మెగాస్టార్ చిరంజీవి తో సినిమాకి కమిట్ చేయించాడు. కానీ మెగాస్టార్ తో ఆ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో అర్ధంకాని పరిస్థితి ఉండడంతో వెంకీ కుడుములు మరొక్కసారి తన హిట్ పెయిర్ తోనే సినిమాని మొదలు పెట్టబోతున్నాడు. వారే నితిన్-రష్మిక.

పుష్ప పాన్ ఇండియా ఫిల్మ్ తప్ప తెలుగులో మరో ప్రోజెక్ట్ లేని రశ్మికకి.. మళ్ళీ ఈ చిత్రంతో కొత్త ప్రోజెక్ట్ దొరికింది. ఇక కొన్నాళ్లుగా సక్సెస్ కి దూరమైన నితిన్ మళ్ళీ తన హిట్ దర్శకుడు వెంకీ తో సినిమా చేయడంపై అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నట్లుగా ఉగాది స్పెషల్ వీడియోస్ తో కన్ ఫర్మ్ చేసారు. నితిన్-రష్మిక-జీవి ప్రకాష్ ఉండగా.. అక్కడి వెంకీ కుడుములు ఎంట్రీ ఇస్తాడు. 

సారీ సారీ లేట్ అయ్యానా అని వెంకీ అడగగా.. బాగా అంటూ నితిన్, రష్మిక అంటారు. స్క్రిప్ట్ కూడా బాగా వచ్చింది అని వెంకీ అంటాడు. ఫుల్ ఎంటర్టైనర్ అని నితిన్, లవ్ స్టోరీనా అని రష్మిక, చలో భీష్మనా అని జీవి ప్రకాష్ అడగగా.. కాదు ఇది వేరే అంటూ వెంకీ కుడుములు స్టయిల్ గా చెప్పిన వీడియోని షేర్ చేస్తూ నితిన్-రష్మిక-వెంకీ కుడుములు కాంబోని మైత్రి మూవీ మేకర్స్ కన్ ఫర్మ్ చేసారు.

Bheeshma Combo To Reunite Once Again:

Nithiin - Rashmika - Venky Kudumula Teamed Up Again

Tags:   NITHIIN, RASHMIKA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ