మెగాస్టార్ చిరంజీవి.. వాల్తేర్ వీరయ్య తో పవర్ ఫుల్ మాస్ హిట్ కొట్టి మూడు నెలలు తిరక్కుండానే భోళా శంకర్ ని రిలీజ్ కి రెడీ అయ్యారు. అసలైతే ముందుగా భోళా శంకర్ ని ఏప్రిల్ 14 అంటూ ఎప్పుడో రిలీజ్ డేట్ ఇచ్చారు. కానీ ఆ డేట్ ని పోస్ట్ పోన్ చేస్తూ.. ఈ ఉగాది సందర్భంగా భోళా శంకర్ కొత్త డేట్ ని ప్రకటించారు మేకర్స్. మెహెర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహానటి కీర్తి సురేష్ చిరుకి సిస్టర్ గా నటిస్తుంది.
తమన్నా చిరు పక్కన జోడిగా నటిస్తుండగా.. అక్కినేని యంగ్ హీరో సుశాంత్ మరో కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. చాలా స్టైలిష్ గా మెగాస్టార్ కేరెక్టర్ ని మెహెర్ డిజైన్ చేసారు. ఇప్పటికే చిరు భోళా శంకరుడి లుక్ చూసి మెగా ఫాన్స్ తెగ ఇంప్రెస్స్ అయ్యారు. ఇక ఏప్రిల్ 14 న విడుదల కావల్సిన భోళా శంకర్ ఆ డేట్ మార్చుకుని.. ఇప్పుడు ఆగష్టు 11 న విడుదలకి రెడీ అయ్యింది.
కీర్తి సురేష్ ట్రెడిషనల్ గా శారీలో, తమన్నా మోడరన్ డ్రెస్ లో కనిపిస్తుండగా.. కీర్తి సురేష్-తమన్నా కూర్చున్న సోఫా వెనుకగా మెగాస్టార్ చిరు నించున్న పోస్టర్ తో భోళా శంకర్ ని ఆగష్టు 11 న విడుదల చేస్తున్నట్టుగా ఈ ఉగాది స్పెషల్ గా మేకర్స్ కలర్ ఫుల్ పోస్టర్ తో ప్రకటించారు.