వారిసు సినిమా విడుదల సమయంలో విజయ్ ఆయన భార్య తో విడిపోతున్నారంటూ కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటిని అజిత్ ఫాన్స్ క్రియేట్ చేసి.. స్ప్రెడ్ చేసారని అన్నారు. తర్వాత కొన్నాళ్ళకి హీరో అజిత్ తన భార్య శాలినితో విడిపోతున్నారని.. అజిత్-షాలిని లు 22 ఏళ్ళ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టెయ్యబోతున్నారు, విడాకులకు అప్లై చేసారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అజిత్-షాలిని విడాకుల వార్త చూసి చాలామంది షాకయ్యారు.
అయితే ఇవి కూడా విజయ్ ఫాన్స్ క్రియేట్ చేసి పబ్లిసిటీ చేసినవే.. అజిత్ ఆయన భార్యకి విడాకులు ఇవ్వడం అనేది అవాస్తవం అంటూ అజిత్ ఫాన్స్ క్లారిటీ ఇస్తున్నా తమిళ తంబీల్లో ఏదో అనుమానం. అందుకే అజిత్ వైఫ్ షాలిని ఈ విడాకుల రూమర్స్ కి ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. తాను తన భర్త ఎంత సంతోషంగా ఉంటున్నామో అనేది కొన్ని పిక్స్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసింది. అజిత్ తో కలిసి ఓ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ అవి, వారిద్దరూ వెకేషన్స్ కి వెళ్లి అక్కడ షిప్ లో కలిసి సరదాగా ఉన్న ఫొటోస్. ఇలా వరసగా షాలిని ఫొటోస్ షేర్ చెయ్యడంతో వారి మధ్యన గొడవలేం లేవు.. ఇద్దరూ సఖ్యతగానే ఉన్నారు.
ఈ విడాకుల కథలన్నీ ఎవరో గిట్టని వారు సృష్టించినవే.. లేదంటే అంత అందమైన జంట విడిపోవడం ఏమిటి అంటూ అజిత్ ఫాన్స్ విడాకుల రూమర్స్ క్రియేట్ చేసిన వారిపై ఫైర్ అవుతున్నారు.