సమంత గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడి.. ఆరు నెలల రెస్ట్ తర్వాత మళ్ళీ యాక్టీవ్ గా మారింది. అనారోగ్యం బారిన పడింది.. ఏదో సైలెంట్ గా షూటింగ్స్ చేసుకుంటుందిలే అనుకుంటే.. అలా కాకుండా ఎప్పటిలా సోషల్ మీడియాలోనూ, అలాగే జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ మళ్ళీ బాగా బిజీగా మారిపోయింది. హెల్త్ ప్రోబ్లెంస్ ని ఫేస్ చేసిన సమంత ఎప్పటిలా యాక్టీవ్ గా మారిపోవడం ఆమె అభిమానులకి తృప్తినిచ్చింది. అయితే జిమ్ లో ఇప్పుడు సమంత సాదా సీదాగా వర్కౌట్స్ చెయ్యడం లేదు. సిక్స్ ప్యాక్ బాడీ కోసం ఆమె ప్రయత్నం చేస్తుందా అన్న రేంజ్ లో సమంత వర్కౌట్స్ ఉన్నాయి.
మళ్ళీ ఫిట్ నెస్ కోసం సమంత కష్టం చూసి చాలామంది అమ్మో అంటున్నారు. అయితే తాజాగా సమంత ఫోటో షూట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోస్ చూస్తే వావ్ అనకుండా ఉండలేరు. లూజ్ హెయిర్ తో గమ్మత్తైన చూపులతో ఫెమినిన్ గా మతి పోగెట్టేలా కనబడుతుంది. అయితే సమంత ఇంతిలా రెడీ అయ్యింది శాకుంతలం ప్రమోషన్స్ కోసమే. ఆమె నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ శాకుంతలం ప్రమోషన్స్ ఈమధ్యనే మొదలు పెట్టారు.. దాని కోసమే సమంత ఇంత క్రేజీగా రెడీ అయ్యింది.
సమంత కొత్త ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఆమె ఫాన్స్ హ్యాపీ గా వాటిని షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఖుషి షూటింగ్ లో పాల్గొంటున్న సమంత.. బాలీవుడ్ లో రాజ్ అండ్ DK దర్శకత్వంలో వరుణ్ ధావన్ తో సిటాడెల్ వెబ్ సీరీస్ లో నటిస్తుంది.