Advertisementt

చరణ్-శంకర్ పై ప్రియదర్శి కామెంట్స్

Tue 21st Mar 2023 11:14 AM
priyadarshi,ram charan  చరణ్-శంకర్ పై ప్రియదర్శి కామెంట్స్
Priyadarshi comments on Ram Charan చరణ్-శంకర్ పై ప్రియదర్శి కామెంట్స్
Advertisement
Ads by CJ

బలగం చిత్రం సక్సెస్ తో మంచి ఊపులో ఉన్న ప్రియదర్శి తన కెరీర్ లోనే ఫస్ట్ టైం రామ్ చరణ్ తో శంకర్ దర్శకత్వంలో RC15 లో నటిస్తున్నాడు. రామ్ చరణ్ తో కలిసి మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోవడంపై ప్రియదర్శి ఎగ్జైట్ అవడమే కాదు.. రామ్ చరణ్ గురించి చాలా విషయాలను పంచుకున్నాడు. రామ్ చరణ్ ని రామన్న అంటాను అని, రామన్నని చూస్తే హాఫ్ చిరంజీవి గారిని చూసినట్లే ఉంటుంది అంటూ చరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. అంతేకాకుండా రామన్న తో కలిసి నేనూ సత్య, వెంకీ, చైతన్య అందరం భోజనం చెయ్యడం మెమొరబుల్ మూమెంట్ అని, చరణ్ అంత సింపుల్ గా ఉంటాడని చెప్పాడు.

రామన్నని RC15 సెట్‌లో చూస్తుంటే.. ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ చేసింది ఆయనేనా.. అనిపించింది, అదే విషయాన్ని రామన్నను అడిగితే.. ఏం లేదు, రాజమౌళి గారు చెప్తుంటే నేను చేసేవాడిని అంటూ సింపుల్ గా చెప్పేసేవాడు. RC15 సెట్స్ లో శనకర్ గారు రాగానే రామన్న కూడా అలెర్ట్ అవుతాడు. ఆయన సీన్ గురించి వివరించేటప్పుడు చేతులు కట్టుకుని వింటూ ఉంటాడు, చరణ్ సంస్కారాన్ని, సింప్లిసిటీని చూస్తుంటే.. చాలా గొప్ప పెంపకం అనిపిస్తుందని ఆసక్తికర కామెంట్స్ చేసాడు దర్శి.

ఇక రామ్ చరణ్ బర్త్ డే కి దర్శకుడి శంకర్ RC15 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని సిద్ధం చేస్తున్నారని దిల్ రాజు చెప్పడంతో మెగా ఫాన్స్ ఎంతో ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు. RC15 కి సీఈఓ టైటిల్ పెట్టబోతున్నట్టుగా.. అదే చరణ్ బర్త్ డే కి రివీల్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.

Priyadarshi comments on Ram Charan:

Priyadarshi interesting comments on Ram Charan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ