మంచు ఫ్యామిలీలో ఏదో తెలియని అనిశ్చితి ఏర్పిడినది అనిపించేలా ఈ మధ్యన వారి కదలికలు కనిపిస్తున్నాయి. మంచు మోహన్ బాబు-మంచు విష్ణు ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. మంచు లక్ష్మి ఫిల్మ్ నగర్ లోని తన ఇంట్లోనే ఉంటుంది. మంచు మనోజ్ కొద్దిరోజులుగా మంచు మోహన్ బాబుకి దూరంగా ఉంటున్నాడు. ఇక మంచు మనోజ్ పెళ్లి విషయంలోనూ చాలా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మనోజ్ వివాహం మోహన్ బాబుకి నచ్ఛలేదు అందుకే దూరంగా ఉన్నారు.. పెళ్లి వేడుకలకి దూరంగా ఉండి.. పెళ్ళి సమయానికి మోహన్ బాబు వచ్చారని అనుకున్నా.. తర్వాత మౌనికని ఆశీర్వదించడంతో అదంతా రూమర్ అని తేలిపోయింది.
ఆ తర్వాత మంచు లక్ష్మి షేర్ చేసిన మనోజ్ పెళ్లి వేడుకల్లో మోహన్ బాబు పాల్గొన్న విషయం తెలిసి చాలామంది మంచు అభిమానులు కూల్ అయ్యారు. ఇక మంచు మనోజ్ పెళ్లి విషయంలో మంచు విష్ణు మెయింటింగ్ చేసిన డిస్టెన్స్ ఇప్పటికీ హాట్ టాపిక్కే. మంచు విష్ణు పెళ్లి వేడుకల్లో పాలు పంచుకోలేదు. ఆయన భార్య విరోనికా వచ్చినా.. విష్ణు మాత్రం దూరంగా ఉన్నాడు. ఇక పెళ్ళికి కూడా మంచు విష్ణు భార్య తో కలిసి వచ్చి వెంటనే వెళ్ళిపోయాడు.
అదలా ఉంటే నిన్న మోహన్ బాబు బర్త్ డే వేడుకల్లో మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక, మంచు లక్ష్మి కనిపించారు. మంచు విష్ణు మాత్రం తండ్రితో తాను ఉన్న వీడియోని షేర్ చేస్తూ మోహన్ బాబుకి బర్త్ డే విషెస్ చెప్పాడు. అందులో మనోజ్ కానీ, లక్ష్మి కానీ కనిపించలేదు. ఇదంతా మంచు ఫ్యామిలో ఏదో జరుగుతుంది అనిపించేలా ఉండడం నిజంగా విచిత్రమనే చెప్పాలి. అది చూసే మంచు ఫ్యామిలిలో ఏమిటి విచిత్ర పరిస్థితి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.