అఖిల్ అక్కినేని ప్రస్తుతం CCL లో దుమ్మురేపుతున్నాడు. క్రికెటర్ లో అఖిల్ ఇరగదీసాడు అనే విషయం తెలిసిందే. అటు CCL లో చెలరేగిపోతున్న అఖిల్ ఇటు ఏజెంట్ లో సాక్షి వైదే తో డ్యూయెట్స్ తో రొమాంటిక్ యాంగిల్ చూపిస్తున్నాడు. ఏప్రిల్ 28 ఏజెంట్ విడుదలకు మేకర్స్ ముహూర్తం పెట్టారు. పలుసార్లు రిలీజ్ తేదీలు మార్చుకుంటూ ఫైనల్ గా ఏప్రిల్ లో డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈసారి ఏజెంట్ మూవీతో అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు.
స్టయిలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఏజెంట్ పై హైప్ క్రియేట్ చేసేందుకు నాగార్జున బిగ్ ప్లాన్ వేస్తున్నారని సమాచారం. అంటే ఏజెంట్ పాన్ ఇండియా ప్రేక్షకులకి రీచ్ అవ్వాలంటే పాన్ ఇండియా స్టార్స్ క్రేజ్ ని వాడేయ్యాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆర్ ఆర్ ఆర్ తో ఆస్కార్ దాకా వెళ్లొచ్చిన ఎన్టీఆర్-రామ్ చరణ్ లని అఖిల్ కోసం తీసుకురావాలనుకుంటున్నారట. అటు సురేందర్ రెడ్డికి ఎన్టీఆర్-రామ్ చరణ్ తో మంచి అనుబంధం ఉంది.
ఎన్టీఆర్ తో ఊసరవెల్లి, రామ్ చరణ్ తో ధృవ సినిమాలు చేసిన ఆయన కోసమే కాకుండా.. అఖిల్ తో ఉన్న బాండింగ్ కారణగంగానూ ఎన్టీఆర్-రామ్ చరణ్ లు ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యే ఛాన్స్ వుంది అంటూ సోషల్ మీడియాలో ఒకటే న్యూస్ లు కనిపిస్తున్నాయి. మరి ఏజెంట్ కోసం ఆర్.ఆర్.ఆర్ స్టార్స్ వస్తే ఆ హైప్ మాములుగా ఉండదు కదా.!