భారతదేశమే కాదు.. ఏ దేశంలో అయినా.. స్టార్స్ ని అభిమానుంచే అభిమానులు ఉంటారు. వారు చూపించే అభిమానానికి హద్దులే ఉండవు. ఇక్కడ అభిమానులు బ్యానెర్లు కట్టడం, ప్రీ రిలీజ్ ఈవెంట్ లకి హాజరై జై జై లు పలుకుతూ ఉంటారు. కానీ అమెరికా ఇతర దేశాల్లో అభిమానులు మాత్రం సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు అదంతా చూపిస్తారు. అలాగే అభిమాన సంఘాలు ఇండియా లోనే కాదు, అమెరికా లాంటి దేశాల్లోనూ ఉంటాయి. ఆర్.ఆర్.ఆర్ విడుదలప్పుడు రామ్ చరణ్ ఫాన్స్, ఎన్టీఆర్ ఫాన్స్ కార్లతో ఆర్.ఆర్.ఆర్ పేర్లు రాసి హీరోలకి సర్ ప్రైజ్ ఇచ్చారు.
ఇప్పుడు కూడా యంగ్ టైగర్ అభిమానులు ఇండియాలో NTR30 ఓపెనింగ్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో.. అమెరికాలో ఎన్టీఆర్ ఫాన్స్ కూడా NTR30 ఓపెనింగ్ పై అంతే ఆతృతగా ఉన్నారు. ఆ విషయాన్ని ఇప్పుడు వారు ఆకాశమే హద్దుగా తెలియజేసారు. మరి రెండు రోజుల్లో NTR30 మొదలు కాబోతున్న తరుణాన్ని యుఎస్ ఫాన్స్ సెలెబ్రేట్ చేసుకుంటూ.. థాంక్యూ ఎన్టీఆర్.. NTR30 కోసం వేచి ఉండలేకపోతున్నామంటూ బ్యానర్ లని ఎయిర్ జెట్ ద్వారా గాల్లోకి ఎగరేస్తూ.. తమ అభిమానాన్ని చూపించారు.
అది చూసిన నెటిజెన్స్ అమ్మో ఎన్టీఆర్ ఫాన్స్ మామూలోళ్లు కాదు, ఛిల్ ఉన్నారు భయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అభిమానానికి ఇండియా లేదు, అమెరికా లేదు.. ఎక్కడైనా ఒకటే మరి. ఈ నెల 23న కొరటాలతో శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త సినిమా మొదలు కాబోతుంది.