ఆదిపురుష్ రిలీజ్ అవ్వడానికి ఇంకా 100 రోజులుంది అంటూ మార్చి 16 న ప్రభాస్ ఫాన్స్ నానా హడావిడి చేసారు. సినిమా రిలీజ్ అయ్యి 100 రోజులు ఆడితే సెలెబ్రేట్ చేసుకోవాల్సింది పోయి సినిమా రిలీజ్ కి 100 ల సమయాన్ని కూడా సెలెబ్రేట్ చేసుకోవడమే కాస్త అతి అనిపించింది. అయితే వచ్చే శ్రీరామ నవమికి అంటే మరో పది రోజుల్లో ఆదిపురుష్ నుండి అప్ డేట్ ఉంటుంది అని ప్రభాస్ ఫాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
ఓమ్ రౌత్ ని ఆదిపురుష్ అప్ డేట్ కోసం వెంటాడుతున్నారు. అసలే ఆదిపురుష్ టీజర్ తో బాగా డిస్పాయింట్ అయ్యి ఉన్న ఫాన్స్ ని ఎలా కూల్ చేస్తారో తెలియదు కానీ.. ఫాన్స్ మాత్రం ఆదిపురుష్ అప్ డేట్ కోసం తెగ వెయిట్ చేస్తూ మరోసారి సోషల్ మీడియాలో ఓమ్ రౌత్ ని ఏసుకునే పనిలో ఉన్నారు. ఈసారి ఆదిపురుష్ అప్ డేట్ ఫాన్స్ మెచ్చేలా సోషల్ మీడియా షేక్ అయ్యేలా.. ట్రోల్ చేసిన వారికి దిమ్మతిరిగేలా ఉండాలనేది ప్రభాస్ ఫాన్స్ కోరిక.
అదేదో ఆదిపురుష్ అప్ డేట్ ఈ నవమి కి ఉంటె బావుంటుంది అనుకుంటున్నారు. కానీ మేకర్స్ నుండి ఎలాంటి వార్త బయటికి రావడమే లేదు. #StartAdipurushPromotions, Wake Up OM raut అంటూ ఓమ్ రౌత్ ని ఆడుకుంటున్నారు. ఫాన్స్ కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అసలు ఆదిపురుష్ అప్ డేట్ ఇస్తారా.. ఇవ్వరా ఏదో ఒకటి చెప్పమంటూ మరోసారి రెచ్చిపోతున్నారు.