సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య నటుడు ధనుష్ కి విడాకులిచ్చి తన పిల్లలతో చెన్నై లో ఒంటరిగా ఉంటుంది. 18 ఏళ్ళ వైవాహిక జీవితానికి ఐశ్వర్య-ధనుష్ లు విడాకులతో స్వస్తి చెప్పారు. మధ్యలో వీళ్ళు విడాకులు రద్దు చేసుకోబోతున్నారనే న్యూస్ నడిచినా.. ధనుష్, ఐశ్వర్య లు విడివిడిగానే జీవిస్తున్నారు. పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తున్నారు. వీరి విడాకుల విషయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మధనపడడం తప్ప వాళ్ళకి నచ్చచెప్పలేకపోయారనే వార్తలు చక్కర్లు కొట్టాయి.
అయితే చెన్నైలోని ఐశ్వర్య నివాసంలో చోరీ జరిగినట్లుగా తెలుస్తుంది. ఐశ్వర్య ఇంట్లోకి దొంగలు ప్రవేశించి నగదు, బంగారం దోచేసినట్లుగా వార్తలొస్తున్నాయి. అప్పుడప్పుడు తండ్రి రజినీకాంత్ ఇంటికి వచ్చి వెళుతుండే ఐశ్వర్య ప్రస్తుతం లాల్ సలాం సినిమా దర్శకత్వంలో బిజీగా వుంది. ఈ క్రమంలోనే ఆమె షూటింగ్ లో వేరే ప్రదేశంలో ఉండగా.. ఐశ్వర్య ఇంట్లో దొంగలు పడినట్లుగా తెలుస్తుంది. బంగారం, కొంతమేర డబ్బు ఎత్తుకెళ్లినట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ చోరీపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.