Advertisementt

ఈ రవితేజ.. ఆ రవితేజ కాదు!

Mon 27th Mar 2023 10:52 AM
ravi teja,vishwak sen,mass raja ravi teja,tollywood,ravi teja mullapudi  ఈ రవితేజ.. ఆ రవితేజ కాదు!
New Director Ravi Teja Introduced to Tollywood ఈ రవితేజ.. ఆ రవితేజ కాదు!
Advertisement
Ads by CJ

రవితేజ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ఆదివారం ఓ చిత్రం ప్రారంభమైంది. అయితే రవితేజ అనగానే అంతా మాస్ రాజా రవితేజ అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ రవితేజ.. ఆ రవితేజ కాదు. విశ్వక్ సేన్‌ని డైరెక్ట్ చేయబోతున్నది రవితేజ ముళ్లపూడి. నూతన దర్శకుడు. ఈ చిత్రంతోనే దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. కానీ ఈ సినిమా ప్రారంభమై.. సోషల్ మీడియాలోకి వార్త వచ్చే సరికి.. మాస్ రాజా డైరెక్టర్‌గా మారుతున్నాడంటూ కొందరు వార్తలు వైరల్ చేస్తున్నారు. వాస్తవానికి మాస్ రాజాకి కూడా డైరెక్షన్ చేయాలని ఉంది. ఆ విషయం ఆ మధ్య చెప్పాడు కూడా. కాకపోతే అది ఇప్పుడు కాదని కూడా క్లారిటీ ఇచ్చాడు. ఇంకా చాలా టైముంది.

ఇక విశ్వక్ సేన్, రవితేజ కాంబినేషన్‌లో ప్రారంభమైన సినిమా విషయానికి వస్తే.. ఇది విశ్వక్‌కి 10వ చిత్రం. ప్రస్తుతం ఆయన నటించిన ‘దాస్ కా ధమ్కీ’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతోన్న ‘దాస్ కా ధమ్కీ’ చిత్రానికి దర్శకుడు, నిర్మాత కూడా విశ్వక్ సేనే. నివేతా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. ఆదివారం ప్రారంభమైన చిత్రంలో విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం 7గా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ప్రారంభోత్సవం అనంతరం హీరో విశ్వక్‌కు, నిర్మాత రామ్ తాళ్లూరికి దర్శకుడు రవితేజ ముళ్లపూడి కృతజ్ఞతలు తెలిపాడు. హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. రామ్ తాళ్లూరి నా ఫేవరేట్ నిర్మాత. ఇది నా 10వ చిత్రం. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలన్నింటిలోకీ భిన్నంగా వుంటుంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. కొత్త దర్శకుడు రవితేజ చాలా టాలెంటెడ్. కథ అద్భుతంగా నేరేట్ చేశాడు. సినిమా కూడా అదే స్థాయిలో తీస్తాడని అనుకుంటున్నాను. సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు. సో.. అది ఈ రవితేజ కథ.

New Director Ravi Teja Introduced to Tollywood:

Ravi Teja directs Vishwak Sen and Movie Started

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ