Advertisementt

వైజాగ్ క్రికెట్ స్టేడియంలో ‘దసరా’ మోత!

Mon 27th Mar 2023 10:07 AM
natural star nani,rohit sharma,gentleman,kohli,gang leader,dasara,promotion  వైజాగ్ క్రికెట్ స్టేడియంలో ‘దసరా’ మోత!
Natural Star Nani Promotes Dasara Movie At Vizag Cricket Stadium వైజాగ్ క్రికెట్ స్టేడియంలో ‘దసరా’ మోత!
Advertisement
Ads by CJ

న్యాచురల్ స్టార్ నాని నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం ‘దసరా’. ఈ సినిమా ప్రచారాన్ని నాని యమా యాక్టివ్‌గా నిర్వహిస్తున్నారు. ఈ నెల 30వ తేదీన సినిమా విడుదల కాబోతుండటంతో.. సినిమాని మ్యాగ్జిమమ్ ఆడియన్స్‌లోకి రీచ్ చేసేందుకు నాని తన ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగా కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా.. ‘దసరా’ టీమే కనిపిస్తున్నారు. తాజాగా నాని.. ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య వైజాగ్‌లో జరిగిన రెండో వన్డే‌లో హల్ చల్ చేశారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు.. వైజాగ్ స్టేడియంలో కాసేపు నాని ‘దసరా’ మోత మోగించారు.

అంతేకాదు, టీమ్ ఇండియా క్రికెటర్లకు తన సినిమా పేర్లు ఏవి కరెక్ట్‌గా సూట్ అవుతాయో కూడా నాని చెప్పుకొచ్చారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు సునీల్ గావస్కర్, ఎమ్మెస్కే ప్రసాద్, ఆరోన్ ఫించ్‌లతో మాట్లాడిన నాని.. ఆరోన్ ఫించ్‌కు తన ‘దసరా’ సినిమాలోని ‘ధూమ్ ధూమ్’ సిగ్నేచర్ స్టెప్‌ను నేర్పించాడు. ఇద్దరూ కలిసి ఈ స్టెప్ వేస్తుంటే స్టేడియం హోరెత్తిపోయింది. తర్వాత క్రికెట్‌లో తనకి ఇష్టమైన ఆటగాడు సచిన్ టెండూల్కర్ అని చెప్పాడు. అప్పట్లో సచిన్ అవుటయితే.. టీవీ ఆపేసేవాడినని.. అతనంటే అంత ఇష్టమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఉన్న జట్టులో రోహిత్ శర్మ అంటే ఇష్టమని తెలిపాడు. 

అనంతరం తెలుగు కామెంటరీ టీమ్‌తో కలిసి కాసేపు సందడి చేసిన నాని.. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు తన సినిమా టైటిల్ అయిన ‘జెంటిల్‌మెన్’ పేరును సూచించాడు. విరాట్ కోహ్లీకి ‘గ్యాంగ్ లీడర్’, హార్ధిక్ పాండ్యాకు ‘పిల్ల జమీందార్’ అనే టైటిల్స్‌ను ఇచ్చాడు. మొత్తంగా అయితే.. ‘దసరా’ని పాన్ ఇండియా రేంజ్‌లోకి తీసుకెళ్లేందుకు ధరణిగా నాని అయితే బాగానే కష్టపడుతున్నాడు. ఇక వైజాగ్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.

Natural Star Nani Promotes Dasara Movie At Vizag Cricket Stadium :

Rohit Sharma Gentleman and Kohli Gang Leader Says Natural Star Nani

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ