సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి ఏడాది తన ఫ్యామిలీతో కలిసి రెండు మూడు వెకేషన్స్ ప్లాన్ చేసుకుంటారు. ఆయన షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. పిల్లల స్కూల్ హాలీడేస్ షెడ్యూల్‌ని బట్టి విదేశీ ట్రిప్స్ వేసుకుంటారు. కొడుకు గౌతమ్, కూతురు సితార, భార్యా నమ్రతతో కలిసి మహేష్ బాబు ఏ లండనో, లేదంటే ఏ స్విట్జర్లాండ్‌కో, ఏ అమెరికాకో, కాదు అంటే దుబాయ్‌కో ప్లాన్ చేసుకుని ఓ 15, 20రోజుల పాటు ఫుల్‌గా ఎంజాయ్ చేయడం మహేష్‌కి అలవాటు.
ఎప్పుడూ ఫ్రెండ్స్‌తో కానీ, ఇతరులతో కానీ మహేష్ వెకేషన్స్‌కి వెళ్లరు. ఖచ్చితంగా తన ఫ్యామిలీతోనే ఆయన వెకేషన్స్‌కి వెళతారు. పిల్లలు హాలీడేస్ టైమ్‌లోనే దొరుకుతారు, ఇక్కడ ఉంటే ఫ్రెండ్స్, స్కూల్స్ అంటూ బిజీగా ఉంటారు. పిల్లల్తో గడిపేందుకు వెకేషన్స్‌కి వెళతాను అంటూ మహేష్ చెబుతూ ఉంటారు. అయితే మొదటిసారి మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌కి వెళ్లడం లేదు. తాజాగా నమ్రత-సితార మాత్రమే ఎయిర్ పోర్ట్‌లో కనిపించారు. ఈసారి గౌతమ్ కూడా ఈ ట్రిప్ మిస్ అయినట్లుగా తెలుస్తుంది. ఇక మహేష్ SSMB28 షూట్‌లో బిజీగా వున్నారు.
అయినా ఈమధ్యనే మహేష్ బాబు స్పెయిన్ వెళ్లివచ్చారు. అలాగే SSMB28 షూటింగ్ చాలాసార్లు వాయిదాపడింది. ఈసారి.. తన వలన సినిమా షూటింగ్ ఆలస్యమవకూడదనే ఉద్దేశ్యంతో మహేష్ ఈ ట్రిప్‌ని త్యాగం చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్ భార్య నమ్రత-సితారలు ఎయిర్ పోర్ట్ పిక్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.