మెగాస్టార్ చిరంజీవికి-మంచు మోహన్ బాబుకి మధ్యన పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది. వాళ్ళిద్దరికీ అస్సలు పొసగదు. అది మా అధ్యక్ష ఎన్నికల సమయం నుండి బాగా ఎక్కువైంది, మంచు మోహన్ బాబుకి మెగాస్టార్ అంటే కోపం, మోహన్ బాబుని లెక్క చెయ్యని చిరు ఇలా మీడియాలో పదే పదే వార్తలు వస్తుంటాయి, చూస్తుంటాము. కానీ వాళ్ళ మధ్యన నిజంగా ఏం జరిగిందో అనేది ఎవ్వరికి తెలియదు. తాజాగా మంచు మోహన్ బాబు తన పుట్టిన రోజు సందర్భంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాలు అలాగే రాజకీయాలు, ముఖ్యంగా చిరంజీవితో గొడవలపై స్పందించారు.
టీచర్ స్థాయి నుండి నటుడిగా ఎదిగి.. ఇప్పుడు యూనివర్సిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మోహన్ బాబు మాట్లాడుతూ హీరోగా సినిమాలు చేసి సక్సెస్ అయ్యాను, హీరోగా డౌన్ లో ఉండగా.. విలన్ కేరెక్టర్స్ చేశాను.. నటుడిగా ఎలాంటి పాత్ర చేయడానికైనా వెనుకాడను, అందులో ఎలాంటి సిగ్గు పడను, సొంత బ్యానర్ లో ఎన్నో సినిమాలు చేశాను, హిట్స్ కొట్టాను.. కానీ కొన్ని సినిమాల ఫెయిల్యూర్ తో ఇష్టపడి కట్టుకున్న ఇల్లు అమ్ముకున్నాను, మళ్ళీ సక్సెస్ అయ్యాను, ఇల్లు కొనుక్కున్నాను, ఈమధ్యన నేను చేస్తున్న సినిమాలు అంతగా ఆడడం లేదు. సన్ అఫ్ ఇండియా ఎక్స్పెరిమెంటల్ మూవీ. అది హిట్ అవ్వలేదు. అది ఓకె కానీ విష్ణు నటించిన జిన్నా మూవీ చాలా బావుంటుంది. అది ప్లాప్ అయ్యింది. విష్ణు కెరీర్ లోనే బెస్ట్ మూవీ అది. అయినా ఎందుకు ఆడలేదో అర్ధం కాలేదు.
ఇక చిరంజీవికి నాకు మధ్యన విభేదాలున్నాయని రాస్తారు. పదే పదే అదే ప్రశ్న వేస్తారు. కానీ మేము ఎన్నోసార్లు ఎదురుపడ్డాము, మట్లాడుకున్నాము. మాది భార్యా-భర్తల సంబంధంలాంటిది. గొడవలు పడుతుంటాం, మళ్ళీ కలిసిపోతాము అంటూ మెగాస్టార్ తో గొడవలపై మంచు మోహన్ బాబు ఆ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.