యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సౌత్ ఇండస్ట్రీలోకి పాన్ ఇండియా ఫిల్మ్ తో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వడానికి అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ రెడీ అయ్యింది. NTR30 హీరోయిన్ గా మేకర్స్ ఈనెల 6 జాన్వీ బర్త్ డే స్పెషల్ గా అనౌన్స్ చేసారు. ఎప్పటినుండో ఎన్టీఆర్ తో నటించాలనే కలను సాకారం చేసుకుంటున్న జాన్వీ కపూర్ తాజాగా ఎన్టీఆర్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఢిల్లీలో ఇండియా టూడే నిర్వహించిన కాన్క్లేవ్ 2023 కార్యక్రమంలో పాల్గొన్న జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో నటించే క్షణాల కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నాను, NTR30 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని చాలా ఎగ్జైట్ అవుతున్నట్లుగా చెప్పింది. అంతేకాకుండా ఎన్టీఆర్ తో కలిసి పని చెంసేదుకు ఉవ్విళ్లూరుతున్నట్లుగా చెప్పిన జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ తేజస్సు, ఆయన ఎనర్జీ లెవల్స్ చూసి ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. ఎన్టీఆర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాను, NTR30 ఎప్పుడు మొదలవుతుందా అని రోజులు లెక్కబెడుతున్నాను.
ప్రతిరోజూ NTR30 దర్శకుడికి మెసేజ్ చేస్తున్నాను నేను. తారక్ తో కలిసి పనిచేయడం నా డ్రీమ్. ఈమధ్యనే ఆర్.ఆర్.ఆర్ సినిమా చూశాను. ఆయన నటన.. తేజస్సు నన్ను ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా జీవితంలో అతి పెద్ద సంతోషాలలో ఒకటి అంటూ జాన్వీ కపూర్ తారక్ పై చేసిన కామెంట్స్ కి ఎన్టీఆర్ ఫాన్స్ ఫిదా అవుతున్నారు.