సినిమాల్లోకి రాకముందే ఎంగేజ్మెంట్ చేసుకుని.. పెళ్ళికి ముందు బ్రేకప్ చేసుకున్న అక్కినేని ప్రిన్స్ అఖిల్ ఆ తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో లవ్లీ హిట్ అందుకున్న అఖిల్.. మాస్ అవతార్ లో ఏజెంట్ గా పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్ ఎండింగ్ లో ఏజెంట్ విడుదల కాబోతుండగా.. ప్రస్తుతం మస్కట్ లో ఏజెంట్ క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. అయితే అఖిల్ CCL లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. క్రికెటర్ గా CCL లో బ్యాటింగ్ లో ఇరగదీస్తున్న అఖిల్ తాజాగా పెళ్లిపై, కెరీర్ పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
ఆ ఇంటర్వ్యూలో మట్లాడుతూ.. ప్రస్తుతం క్రికెట్ టీమ్ లో ఆడుతున్నవారంతా ప్లేయర్స్ గా కాకుండా ఫ్రెండ్స్ గా ఉంటారు, స్కూల్ సమయంలో కూడా క్లాస్ లు ఎగ్గొట్టి క్రికెట్ ఆడేవాళ్ళం. అలా చాలాసార్లు దొరికిపోయాము. ఇక నాకు సోషల్ మీడియా అంటే.. నా సినిమా గురించి అభిమానులకి అప్ డేట్ ఇవ్వడమే తెలుసు, సోషల్ మీడియా అంటే కొంచెం భయం, బిడియం ఉంటుంది. అందుకే ఎక్కువ పోస్ట్ లు పెట్టను, వాడను కూడా. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా లేకపోవడం వలనే అభిమానులు నన్ను ఎక్కువగా మిస్ అవుతూ ఉంటారు.
ఇక నా పెళ్లిపై రూమర్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. కానీ నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు. ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నాను, మింగిల్ అవ్వాలనుకోవడం లేదు. నాకు లవ్ అంటే స్పోర్ట్స్ అంతే కానీ.. ప్రస్తుతానికి ఏ విషయము ఆలోచించను అంటూ అఖిల్ పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.