యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల కాంబోలో ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న NTR30 పూజా కార్యక్రమానికి ఈ రోజే ముహూర్తం అన్నారు. మార్చ్ 18 న NTR30 పూజా కార్యక్రమాలకి ముహూర్తం పెట్టారు. అందుకే యంగ్ టైగర్ అమెరికా నుండి అంత హడావిడిగా హైదరాబాద్ వచ్చేసాడనుకున్నారు. కానీ ఈరోజు NTR30 పూజ కి సంబందించిన ఎలాంటి హడావిడి లేదు.. దానితో ఎన్టీఆర్ ఫాన్స్ కాస్త డిస్పాయింట్ అయ్యారు.
అయితే గత రాత్రి ఎన్టీఆర్ ధమ్కీ ఈవెంట్ లో NTR30 అప్ డేట్ అడిగిన అభిమానుల కోసం త్వరలోనే అన్నారు కానీ అది ఎప్పుడో చెప్పలేదు. అయితే NTR30 మేకర్స్ ఎన్టీఆర్ ఫాన్స్ ని ఇంకా ఇంకా సస్పెన్స్ లో ఉంచడం ఇష్టం లేదు.. కాబట్టే Storm alert ⚠️ #NTR30 Muhurtam on March 23rd 💥💥 అంటూ NTR30 కి ముహూర్తం పెట్టేసి పవర్ ఫుల్ పోస్టర్ తో తేదీ ని గ్రాండ్ గా ప్రకటించేసారు. మార్చ్ 23 న NTR30 పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతుంది.
హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్నారని తెలుస్తుంది. ఈ 23 న మొదలు కాబోయే NTR30 రెగ్యులర్ షూట్ మాత్రం ఈ నెల 29 నుండి మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది.