Advertisementt

ఆ కామెంట్స్ విని డిప్రెషన్ లోకి వెళ్ళా: హిమజ

Sat 18th Mar 2023 02:28 PM
himaja  ఆ కామెంట్స్ విని డిప్రెషన్ లోకి వెళ్ళా: హిమజ
He went into depression after hearing those comments: Himaja ఆ కామెంట్స్ విని డిప్రెషన్ లోకి వెళ్ళా: హిమజ
Advertisement
Ads by CJ

హిమజ సినిమాల్లో కన్నా, సీరియల్స్ లో కన్నా ఎక్కువగా యూట్యూబ్ లో కనిపిస్తుంది. బిగ్ బాస్ లోకి వెళ్లొచ్చాక యూట్యూబ్ ఛానల్ పెట్టి.. రకరకాల వీడియోస్ పెడుతూ అందరి అభిమానం సంపాదించుకుంది. వెండితెర మీద హీరోయిన్స్ కి ఫ్రెండ్ కేరెక్టర్స్ చేసే హిమజ ని ఎవ్వరైనా నెగెటివ్ గా కామెంట్స్ చేస్తే అస్సలూరుకోదు. హిమజకి సినిమాలు లేవు.. అయినా అంత పెద్ద కార్లు, ఇల్లు ఎలా కొంటుందో అని నెగెటివ్ గా చేసే కామెంట్స్ ని అంతే స్పీడు గా తిప్పికొడుతోంది. 

తామేమి అడుక్కు తినడం లేదు, కష్టపడి సంపాదించుకునే కారు కొన్నాను అంటూ క్లారిటీ ఇస్తుంది. తాజాగా సినిమాల్లో తాను ఎదుర్కున్న సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నం చేసేటప్పుడు నీ కళ్ళు బాలేదు, నీ నడక బాలేదు, నువ్వు కొన్ని కేరెక్టర్స్ కి సూట్ అవ్వవు అంటూ మొహం మీదే మాట్లాడేవారు. మేకప్ వేసాక నీ కళ్ళే హైలెట్ అనేవారు.

నా కళ్ళు బావుంటాయనే ప్రశంశలు అందుకున్నాను. కానీ నాపై వచ్చే విమర్శలతో డిప్రెషన్ లోకి వెళ్లి చాలా బాధపడేదానిని, ఘోరంగా ఏడ్చేదానిని. కానీ ఎవ్వరు ఎమన్నా.. మీరు మీలా ఉండండి, ప్రతిసారి సొసైటీ ఏమనుకుంటుందో ఆలోచించకుండా మీ కోసం మీరు ఏది చేస్తే కరెక్ట్ అనిపిస్తుందో అదే చెయ్యండి, మా డ్రైవర్ కి ముగ్గురు పిల్లలు వాళ్ళని నేను చదివించాల్సిన బాధ్యత ఉంది.. తర్వాతే ఏదైనా ఆలోచిస్తాను అంటూ హిమజ తనకెదురైన అవమానకర సంఘటనలు బయటపెట్టింది.

He went into depression after hearing those comments: Himaja:

Such words are hurtful: Himaja

Tags:   HIMAJA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ