Advertisementt

పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న హన్సిక

Sat 18th Mar 2023 02:05 PM
hansika glamour look  పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న హన్సిక
Hansika latest glamour click పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న హన్సిక
Advertisement
Ads by CJ

హన్సిక నిజంగా పాలరాతి శిల్పమే. ఆమె అందం, ఆ సొట్ట బుగ్గలు, పాలలాంటి తెల్లని చర్మంతో నిగ నిగా మెరిసిపోతుంది. ఒకప్పుడు బొద్దుగా ఉండే హన్సిక ఇప్పుడు నాజూగ్గా తయారయ్యింది. తమిళ అభిమానుల గుండెల్లోనేకాదు.. బయట కూడా గుడి కట్టించుకున్న హన్సిక గత ఏడాది డిసెంబర్ లోనే ముంబై కి చెందిన సోహైల్ కతూరియాని వివాహం చేసుకుంది. తన ఫ్రెండ్ మాజీ భర్తని హన్సిక ప్రేమించి పెళ్లి చేసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. 

ఇక హన్సిక పెళ్లి పిక్స్ వైరల్ అవ్వగా ఆమె పెళ్లి వీడియో మీద ప్రముఖ ఓటిటి సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ హైప్ క్రియేట్ చేసింది. అయితే పెళ్లి తర్వాత భర్త తో కలిసి హనీమూన్ కి వెళ్లొచ్చిన ఆమె.. తర్వాత షూటింగ్స్ తో బిజీగా మారింది. తాజాగా హన్సిక ఓ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. నైట్ డిన్నర్ లో హన్సిక పాలరాతి శిల్పంలా మెరిసిపోతూ కనిపించింది. సొట్టబుగ్గల చిన్నది.. మరీ ఇంతందంగానా అంటూ ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఎదురుగా కాండిల్ వెలుగుతుండగా.. హన్సిక పింక్ కలర్ మోడరన్ డ్రెస్ లో చాలా క్యూట్ గా కనిపించింది. బుగ్గ మీద చేయి పెట్టుకుని క్యూట్ అండ్ స్వీట్ గా కనబడుతున్న హన్సిక పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Hansika latest glamour click :

Hansika latest glamour pic viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ