Advertisementt

ఎన్టీఆర్ ఏంటి అలా అనేశాడు

Sat 18th Mar 2023 12:35 PM
jr ntr,ntr30  ఎన్టీఆర్ ఏంటి అలా అనేశాడు
Jr NTR warns his fans ఎన్టీఆర్ ఏంటి అలా అనేశాడు
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఈమధ్యన కోపం త్వరగా వచ్చేస్తుంది అంటూ ఆయన ఫాన్స్ కంప్లైంట్ చేస్తున్నారు. ఆయన ప్రష్టేషన్ అంతా అభిమానుల మీద చూపిస్తున్నారా అనే అనుమానమూ నెటిజెన్స్ లో కనబడుతుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి దాదాపు ఏడాది కావొస్తుంది. కానీ ఆయన కొత్త సినిమాని ఇంకా మొదలు పెట్టకపోవడం అభిమానులనే కాదు.. ఎన్టీఆర్ ని ఒకింత ప్రష్టేషన్ కి గురి చేయడంతోనే ఎన్టీఆర్ పదే పదే బాలన్స్ కోల్పోతున్నాడేమో అనేలా ఉంటుంది ఆయన ప్రవర్తన.

అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానులపై ఎన్టీఆర్ కాస్త చిరాకు ప్రదర్శించాడు. అప్ డేట్ కోసం మీరు చేసే హడావిడి తో నిర్మాతలు ఒత్తిడికి గురవుతున్నారు. మీరు అడిగారని ఏదో ఒకటి ఇవ్వలేము, ఏ అప్ డేట్ అయినా మా భార్య కన్నా ముందు మీకే చెబుతా అంటూ ఫాన్స్ కి వార్నింగ్ ఇచ్చాడు. ఇక NTR30 ఈ నెలలోనే మొదలు కాబోతుంది. ఆ అతృతతో మరోసారి ఎన్టీఆర్ ఫాన్స్ ఆయన్ని ఈ ప్రశ్నతో ఉక్కిరిబిక్కిరి చేసారు.

ఎన్టీఆర్ నిన్న శుక్రవారం రాత్రి విశ్వక్ సేన్ ధమ్కీ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా వెళ్లగా.. అక్కడ ఎన్టీఆర్ అభిమానులు NTR30 అప్ డేట్ కోసం ఆరాటపడి అడిగారు.. దానికి ఎన్టీఆర్ నవ్వుతూనే ఇలా అడిగితే నేను సినిమాలు మానేస్తాను, చెయ్యను అని అంటూనే.. నేను ఆపేస్తే మీరు ఊరుకుంటారా.. నేను కూడా సినిమాలు చెయ్యకుండా ఉండలేను.. త్వరలోనే ఉంటుంది అంటూ ఫాన్స్ ని కాస్త కన్ఫ్యూజ్ చేసాడు.

కానీ ఎన్టీఆర్ ఎంత ప్రష్టేషన్ లో ఉంటే మాత్రం ఇకపై సినిమాలు చెయ్యను అని ఎలా అనేస్తాడు. సరదాకి కూడా ఎన్టీఆర్ ఎలా మాట్లాడితే  ఫాన్స్ తట్టుకోగలరా, అసలే ఇప్పుడు ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అంటూ అభిమానులు, నెటిజెన్స్ సైతం కాస్త ఫీలవుతున్నారు.

Jr NTR warns his fans:

NTR threaten to quit films

Tags:   JR NTR, NTR30
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ