Advertisementt

KGF యశ్ వేధించాడు: శ్రీనిధి క్లారిటీ

Fri 17th Mar 2023 07:13 PM
umair sandhu,yash  KGF యశ్ వేధించాడు: శ్రీనిధి క్లారిటీ
Srinidhi Shetty Gives Clarity On KGF Hero Yash Rumours KGF యశ్ వేధించాడు: శ్రీనిధి క్లారిటీ
Advertisement
Ads by CJ

KGF హీరో యశ్.. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టిని వేధించాడంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మధ్యన సెలబ్రిటీస్ ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో హైలెట్ అవుదామనుకుని భంగపడుతున్న దుబాయ్ సెన్సార్ సభ్యుడు ఉమైర్ సందు.. సెలబ్రిటీస్ పర్సనల్ లైఫ్ లపై పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఉమనైజర్, అందుకే అతనికి అన్ని పెళ్లిళ్లు, నాగ చైతన్య సమంత ని టార్చెర్ పెట్టాడు, ఆమెకి అబార్షన్ చేయించాడు, ఈ వేధింపులు తాళలేకే ఆమె చైతూకి విడాకులిచ్చింది అంటూ పిచ్చి కూతలు కూస్తూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నాడు. 

తాజాగా KGF హీరోయిన్ శ్రీనిధి శెట్టి ని హీరో యశ్ మానసికంగా, శారీరకంగానూ వేధించాడు, అతనితో పని చెయ్యడం అసౌకర్యంగా ఉంది, ఇకపై అతనితో కలిసి పని చేసేది లేదు అంటూ శ్రీనిధి చెప్పినట్లుగా ట్వీటేసాడు. దానితో యశ్ ఫాన్స్ రెచ్చిపోయి ఉమైర్ సంధుని సోషల్ మీడియా వేదికగా ఆడుకుంటున్నారు. ఈలోపు ఈ మేటర్ హీరోయిన్ శ్రీనిధి వరకు వెళ్ళింది. దానితో ఆమె ఓపెన్ లెటర్ ఒకటి షేర్ చేసింది. ఆ లెటర్ లో.. సోషల్ మీడియాని కొంతమంది చెడు పనులకి, దుష్ప్రచారానికి వాడుకుంటున్నారు, 

అదే నేనైతే సోషల్ మీడియాలో ముఖ్యమైన వ్యక్తులని ప్రశంసించడానికి, అలాగే సంతోషాన్ని, ప్రేమని చూపించడానికి మాత్రమే వినియోగిస్తాను, ఇక్కడ మీకో విషయం సూటిగా చెప్పాలనుకుంటున్నాను, KGF తో ఓ ప్రపంచాన్ని సృష్టించారు. హీరో యశ్ తో కలిసి పని చెయ్యడం గౌరవంగా భావిస్తాను, అతను కేవలం జెంటిల్మన్ మాత్రమే కాదు, ఓ మెంటర్, ఫ్రెండ్ కూడా. యశ్ కి నేనెప్పుడూ అభిమానినే అంటూ శ్రీనిధి తన నోట్ లో రాసుకొచ్చింది. 

Srinidhi Shetty Gives Clarity On KGF Hero Yash Rumours:

Umair Sandhu Controversial Comments on Hero Yash

Tags:   UMAIR SANDHU, YASH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ