రామ్ చరణ్.. రాజమౌళి వాళ్లతో కలిసి హైదరాబాద్ కి రాలేదు. ఆయన అమెరికా నుండి భార్య ఉపాసన, తన పెంపుడు కుక్క రైమా తో పాటుగా ఆస్కార్ వచ్చిన సందర్భంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలవబోతున్నాడు. ఈ రోజు ఉదయమే రామ్ చరణ్-ఉపాసనలు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో దిగగానే.. అక్కడి మీడియా అలాగే అభిమానులు చరణ్ ని చుట్టుముట్టారు. ఆర్.ఆర్.ఆర్ కి ఆస్కార్ వచ్చినందుకు సంతోషంగా ఉంది. నాటు నాటు ఇకపై అందరిది, అందరికి పేరు పేరునా ధన్యవాదాలంటూ రామ్ చరణ్ మీడియాతో మాట్లాడాడు.
రామ్ చరణ్ ఢిల్లీలో దిగగానే ఆయనకి అభిమానుల నుండి స్వాగతం లభించింది. అందరికి చరణ్ అభివాదం చేసాడు. అక్కడ ఢిల్లీలోనే అలా ఉంటే.. రామ్ చరణ్ మోడీ తో మీటింగ్ తర్వాత హైదరాబాద్ కి చేరుకున్నాక హైద్రాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆయన అభిమానుల కోలాహలం ఎలా ఉండబోతుందో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. రామ్ చరణ్ కి జై జై పలుకుతూ గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పేందుకు మెగా ఫాన్స్ రెడీ అవుతున్నారు.
రామ్ చరణ్ కి స్వాగతం పలుకుతూ ర్యాలీగా తీసుకురావాలనే ప్రయత్నాల్లో మెగా ఫాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక రామ్ చరణ్ HCA అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్ తర్వాత ఆయన మొదటగా ఢిల్లీ లో అడుగుపెట్టారు. తర్వాత హైదరాబాద్ కి రాబోతున్నారు. సో అభిమానులు చాలా ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు.