ఉప్పెన సినిమాతో 17 ఏళ్లకే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. యంగ్ హీరోల అవకాశాలతో ఊపిరాడకుండా బిజీగా మారిన కృతి శెట్టి కి హ్యాట్రిక్స్ హిట్స్ పడినట్లే.. హ్యాట్రిక్ డిజాస్టర్స్ వచ్చాయి. దానితో కృతి శెట్టి కొద్దిగా డౌన్ అయినట్లుగా కనిపించినా ప్రస్తుతం తెలుగు, తమిళ ఆఫర్స్ తో కళకళలాడుతుంది. అయితే సినిమా ప్రమోషన్స్ అప్పుడు తప్ప పెద్దగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండదు.
టాప్ హీరోయిన్స్ కూడా సోషల్ మీడియాలో గ్లామర్ షూట్స్ వదులుతున్న రోజులివి. కానీ కృతి శెట్టి ఎందుకో పెద్దగా సోషల్ మీడియాలో కనిపించదు. తాను నటించిన సినిమా ప్రమోషన్స్ అప్పుడు సోషల్ మీడియాలో తన అందమైన క్యూట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ యూత్ ని అట్రాక్ట్ చేస్తుంది. కృతి శెట్టి యాక్ట్ చేసిన నాగ చైతన్య కష్టడి మే లో రిలీజ్ కాబోతుంది. తాజాగా టీజర్ రిలీజ్ అయ్యింది.
అయితే ఇప్పుడు కృతి శెట్టి సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఆ పిక్స్ లో ఎంతో క్యూట్ గా స్వీట్ గా.. సింపుల్ గా చాలా అందంగా కనిపించింది. లూజ్ హెయిర్ తో, గమ్మత్తైన చూపులతో ఫొటోలకి ఫోజులిచ్చింది. కృతి శెట్టిని అలా చూడగానే.. క్యూటీ.. బ్యూటిఫుల్ అనకుండా ఉండలేదు.