సీనియర్ నటుడు నరేష్-నటి పవిత్ర లోకేష్ ఫైనల్ గా పెళ్లి చేసుకుని ఆ వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ దుబాయ్ హనీమూన్ కి వెళ్లిపోయారు. దుబాయ్ లో చెట్టాపట్టాలేసుకుని చేతులు చేతులు పట్టుకుని యంగ్ కపుల్ మాదిరి అక్కడి షాపింగ్ మాల్స్, ఎడారుల్లో ఎంజాయ్ చేసారు. అయితే నరేష్ కి పవిత్రతో నాలుగో పెళ్లి. ఆయనకి మూడు పెళ్లిళ్లు కాగా.. అవన్నీ విడాకులకు దారి తియ్యగా.. పవిత్ర లోకేష్ ని నాలుగో వివాహం చేసుకున్నాడు. ఇక పవిత్రకి కూడా నరేష్ తో మూడో పెళ్లి. ఆమె భర్త కి విడాకులిచ్చి కొన్నాళ్లుగా నరేష్ తోనే కలిసి ఉంటుంది.
తాజాగా నరేష్-పవిత్ర వివాహం చేసుకోవడంతో నరేష్ మాజీ భార్య రమ్య సైలెంట్ గానే ఉంది. కానీ పవిత్ర లోకేష్ మాజీ భర్త సూచేంద్ర పవిత్రపై సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. తాజాగా ఆయన కన్నడ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేష్-పవిత్రల పెళ్లిపై ప్రశ్న ఎదురవగా ఆయన మాట్లాడుతూ.. పవిత్రకి డబ్బు పిచ్చి, ఆమె లగ్జరీ లైఫ్ కోసం ఏమైనా చేస్తుంది. ఆస్తి కోసమే ఆమె నరేష్ వెంట పడుతుంది, నరేష్ తో లవ్ ట్రాక్ నడిపింది. డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతోంది. ఆ డబ్బు పిచ్చి ఎక్కువై గతంలో ఇద్దరికి విడాకులిచ్చింది.
ఆ విషయం నరేష్ కి ఇంకా అర్ధం కావడం లేదు. నరేష్ కి దగ్గరై ఆయన తల్లి విజయ నిర్మల గారు సంపాదించిన 1500 కోట్లు కొట్టేసే ప్లాన్ చేసుకుంది. ఈ విషయం త్వరలోనే నరేష్ కి కూడా అర్ధమవుతుంది.. అంటూ సూచెంద్ర పవిత్ర లోకేష్ పై దారుణమైన కామెంట్స్ చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది.