కీర్తి సురేష్ కి ఇప్పటివరకు కమర్షియల్ సక్సెస్ లేదు. యంగ్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న కీర్తి సురేష్.. మహానటితో అద్భువతమైన హిట్ సాధించింది. తర్వాత వరసగా తమిళ స్టార్ హీరోలతో సినిమాలు చేసింది కానీ అవి సక్సెస్ కాకపోవడంతో ఆమెకి.. తెలుగు స్టార్ ఛాన్స్ లు రాలేదు. మహేష్ సర్కారు వారి పాట కూడా కీర్తి సురేష్ కి సక్సెస్ ఇచ్చినా ఆమెకి ఆ సినిమా అంతగా అవకాశాలు తెచ్చిపెట్టలేదు. నానితో పక్కా లోకల్ మూవీ చేసిన ఆమెకి మళ్ళీ దసరా పాన్ ఇండియా మూవీలో ఆఫర్ ఇచ్చాడు నాని. దసరా మార్చి 30న పాన్ ఇండియాలోని ఐదు భాషల్లో విడుదల కాబోతుంది.
ఈ చిత్రం గనక కమర్షియల్ గా వర్కౌట్ అయితే కీర్తి సురేష్ దశ తిరిగినట్టే. తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో ఇలా అన్ని భాషల్లో ఆమెకి ఛాన్సెస్ వస్తాయి. దసరాలో డీ గ్లామర్ రోల్ లో కీర్తి సురేష్ రఫ్ గా మాస్ కేరెక్టర్ లో కనబడుతుంది. ప్రస్తుతం దసరా ప్రమోషన్స్ లో కీర్తి సురేష్ బిజీగా మారింది. అయితే నాని దసరా కి కాస్త పాజిటివ్ టాక్ తగిలినా కీర్తి సురేష్ పంటపండినట్టే.
తెలుగులోనూ ఆమెకి స్టార్స్ ఛాన్సెస్ తగిలే అవకాశం ఉంది. దసరా హిట్ అయ్యిందా.. కీర్తి సురేష్ రేంజ్ ఒక్కసారిగా మరిపోతుంది. ప్రస్తుతం ఆమె నటించిన దసరా రిలీజ్ అవుతుండగా.. మెగాస్టార్ చిరుకి చెల్లెలిగా భోళా శంకర్ లో నటిస్తుంది.