Advertisementt

ఈ ఛాన్స్ ని క్యాష్ చేసుకుంటాడా?

Thu 16th Mar 2023 01:00 PM
naga shaurya,phalana abbayi-phalana ammayi  ఈ ఛాన్స్ ని క్యాష్ చేసుకుంటాడా?
Will you cash in on this chance? ఈ ఛాన్స్ ని క్యాష్ చేసుకుంటాడా?
Advertisement
Ads by CJ

నాగ శౌర్య టైమ్ అస్సలు బాగోలేదు. ఆయన సినిమాలకి యావరేజ్ టాక్ వచ్చినా డబ్బులు రావడం లేదు. అలా ఎందుకు అవుతుందో తెలియదు. వరుడు కావలెను, కృష్ణ వ్రింద విహారి సినిమాలకి యావరేజ్ టాక్ వచ్చాయి. కానీ ఆ సినిమాలకు అంతగా కలెక్షన్స్ రాలేదు. కానీ ఇప్పుడు నాగ శౌర్యకి లక్కీ ఛాన్స్ తగిలింది. రేపు శుక్రవారం నాగ శౌర్య ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి సినిమా రిలీజ్ కాబోతుంది. 

ఈ సినిమాతో పోటీపడేందుకు మరే సినిమా కూడా కనిపించడం లేదు. గత వారం బలగం చిన్న సినిమా ఎంత పెద్ద హిట్ అయినా.. అది జస్ట్ మొదటి వారానికే క్లోజ్ అయ్యే సినిమా. సో రేపు మొత్తం నాగ శౌర్యదే. మరి ఈ ఛాన్స్ ని కుర్ర హీరో ఎలా క్యాష్ చేసుకుంటాడో చూడాలి.. ప్రస్తుతం ప్రమోషన్స్ పరంగా ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయి ఇంట్రెస్టింగ్ గానే కనిపిస్తుంది. మరి ఈ సినిమాకి కొద్దిగా మంచి పాజిటివ్ టాక్ వచ్చినా.. సినిమా గట్టెక్కేస్తుంది.

తెలుగు నుండే కాదు, తమిళం నుండి, హిందీ నుండి ఎలాంటి పోటీ లేదు. మరోపక్క కన్నడ నుండి కబ్జా వస్తుంది. అది పెద్దగా పోటీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. నాగ శౌర్య అదృష్టాన్ని రేపు ఫ్రైడే డిసైడ్ చేయబోతుంది. ఫలానా అబ్బాయి-ఫలానా అమ్మాయితో ఈ యువ హీరో ఎంతవరకు సక్సెస్ అవుతాడో.. మరి కొద్దిగంటల్లో తేలిపోతుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ.

 

Will you cash in on this chance?:

Will Naga Shaurya cash the super chance?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ