Advertisementt

విదేశాల్లో రిలాక్స్ అవుతున్న రాశి ఖన్నా

Thu 16th Mar 2023 12:00 PM
actress raashi,paris  విదేశాల్లో రిలాక్స్ అవుతున్న రాశి ఖన్నా
Rashi Khanna relaxing Paris విదేశాల్లో రిలాక్స్ అవుతున్న రాశి ఖన్నా
Advertisement
Ads by CJ

తెలుగు, తమిళ సినిమాల్లో ప్రస్తుతం పెద్దగా కనిపించని హీరోయిన్ రాశి ఖన్నా ఓటిటి డెబ్యూట్ తోనే మంచి హిట్ అందుకుంది. అమెజాన్ ప్రైమ్ కోసం రాజ్ అండ్ DK చేసిన ఫార్జి వెబ్ సీరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన రాశి ఖన్నా.. ఆ సీరీస్ లో చాలా డీసెంట్ గా ఆకట్టుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో మరో చిత్రంలో నటిస్తుంది. అయితే ఈమధ్యన తెలుగు, తమిళ అవకాశాలు రాశి కన్నా వదులుకోవడానికి కారణం ఆమె పెళ్లి చేసుకోబోతుంది అందుకే.. సౌత్ లో కనిపించడం లేదనే రూమర్ వినిపించింది.

రీసెంట్ గా పెళ్లి రూమర్స్ కొట్టేసిన రాశి ఖన్నా తెలుగు, తమిళంలో నాలుగైదు కథలు విన్నాను.. త్వరలోనే కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఇకపై గ్లామర్ షో కాకుండా.. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తాను అని చెప్పిన రాశి ఖన్నా.. ప్రస్తుతం పారిస్ లో రిలాక్స్ అవుతుంది. అక్కడ పారిస్ అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. రాశి ఖన్నా పారిస్ ట్రిప్ పిక్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Rashi Khanna relaxing Paris:

Actress Raashi Khanna in Paris

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ