Advertisementt

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న PKSDT లీకెడ్ పిక్

Thu 16th Mar 2023 11:26 AM
pksdt,pawan kalyan  సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న PKSDT లీకెడ్ పిక్
PKSDT Leaked Pic Creating Sensation సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న PKSDT లీకెడ్ పిక్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ అనే కాదు.. ఏ హీరో సినిమా లొకేషన్ నుండి అయినా లీకులు అనేవి ఇప్పుడు సర్వ సాధారణం అయ్యిపోయాయి. ఒకప్పుడు ఏదైనా సినిమా షూటింగ్ నుండి లీకులు లేకుండా జాగ్రత్తలు తీసుకునే మేకర్స్.. ఇప్పుడు కావాలనే సినిమాపై హైప్ క్రియేట్ చేసుకోవడానికి లీకులు వదులుతున్నారనే టాక్ కూడా ఉంది. సలార్, ఆర్.ఆర్.ఆర్, పుష్ప ఇలాంటి పెద్ద సినిమాలకే ఈ లీకుల బాధ తప్పలేదు. RC15 నుండి కూడా ఇదే తంతు. అసలు ఫస్ట్ లుక్స్ వదిలినా ఈ లీకుల బెడద వదలడం లేదు.

తాజాగా పవన్ కళ్యాణ్-సాయి తేజ్ కలయికలో సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లొకేషన్ నుండి దేవుడి కేరెక్టర్ లో పవన్ కళ్యాణ్, ఆయన పక్కనే సాయి తేజ్ ఉన్న లొకేషన్ పిక్స్ లీకై సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. నిన్న బుధవారం నుండి PKSDT హాష్ టాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ అందులో ఆ పిక్ ని వైరల్ చేస్తున్నారు. సినిమాలో సీన్ కి సంబంధించి ఓ పిక్ లీక్ అయ్యి ఇప్పుడు అంతగా వైరల్ అవుతుంది. 

దీనితో పవన్ ఫ్యాన్స్ ఆ లీకెడ్ పిక్ లోని పవన్ లుక్స్ చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొంతమంది ఇలా లీకుల వలన సినిమా మీద హైప్ తగ్గుతుందేమో అని భయపడుతున్నారు. అన్నట్టు ఈ సినిమా కి రోజుకి రెండు కోట్లు తీసుకుంటున్నట్లుగా పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే జనసేన మహా సభలో రివీల్ చేసారు. దానితో ఈ సినిమాపై ఫాన్స్ లోనే కాదు ప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్రేజ్ మొదలయ్యింది.

PKSDT Leaked Pic Creating Sensation:

PKSDT working leaked pic goes viral

Tags:   PKSDT, PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ