Advertisementt

తెలుగు ప్రేక్షకులకు ఇరట్ట గుడ్ న్యూస్

Thu 16th Mar 2023 11:01 AM
joju george,iratta  తెలుగు ప్రేక్షకులకు ఇరట్ట గుడ్ న్యూస్
Iratta Telugu Version now streaming on Netflix తెలుగు ప్రేక్షకులకు ఇరట్ట గుడ్ న్యూస్
Advertisement
Ads by CJ

ఓటిటీలు అందుబాటులోకి వచ్చాక భాషకు ఎల్లలు చెరిపేసి.. ఏ భాష సినిమాని అయినా ఆదరించే స్థాయికి సినిమా ప్రేక్షకులు వచ్చేసారు. మళయాళమైనా, తమిళ్ అయినా, కన్నడ అయినా, తెలుగు, హిందీ ఇలా ఏ భాష సినిమాలని అయినా ఓటిటీలలో చూసేస్తున్నారు. తమ అభిప్రాయాలని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అలాగే కాంతార, మాలికాపురం తక్కువ బడ్జెట్ లతో తెరకెక్కి ఇతర భాషల్లో అద్భుతమైన విజయాన్ని సాధించి ఓటిటీలలో సూపర్ హిట్ అయినట్లుగా ఇప్పుడో మలయాళం మూవీ అంతే సెన్సేషన్ క్రియేట్ చేసింది.

జోజూ జార్జ్ డ్యూయెల్ రోల్ లో మలయాళంలో తెరకెక్కిన ఇరట్టని మలయాళ వెర్షన్ లో నెట్ ఫ్లిక్స్ లో వీక్షించిన వారు.. సినిమా సూపర్, కాన్సెప్ట్ అదుర్స్, ఇరాట్ట చాలా బావుంది, మాకు బాగా నచ్చింది, మర్డర్ మిస్టరీ కొత్తగా ఉంది, జోజు జ్జర్జ్ పెర్ఫెర్మెన్స్ అదుర్స్, దర్శకత్వం సూపర్బ్ అంటూ పెడుతున్న ట్వీట్స్ చూసి.. అబ్బా ఇంతమంచి సినిమా తెలుగులో ఎప్పుడొస్తుందో అని తెలుగు ప్రేక్షకులు ఎదురు చూసారు. చాలామంది ఇప్పటికే మలయాళ వెర్షన్ చూసేసినా.. తెలుగులో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు.

మార్చి 3న ఓటిటిలో రిలీజైన ఈ సినిమాని భాషతో సంబంధం లేకుండా ఆదరించారు ప్రేక్షకులు.. అయినప్పటికీ తెలుగు వెర్షన్ కావాలని అడిగినవారికి నెట్ ఫ్లిక్స్ ఆ గుడ్ న్యూస్ చెప్పేసింది. మార్చ్ 14 నుండి ఇరట్టని తెలుగు వెర్షన్ లో స్ట్రీమింగ్ చెయ్యడంతో తెలుగు ఆడియన్స్ ఖుషీగా ఫీలవుతున్నారు. జోజు జార్జ్ నటనని మెచ్చుకుంటున్నారు. వినోద్-ప్రమోద్ లుగా డ్యూయెల్ కేరెక్టర్ లో, సోదరుడు వినోద్ మర్డర్ మిస్టరీని ప్రమోద్ ఎలా హ్యాండిల్ చేసాడో అనేది ఈ సినిమా కథ. ఈ సినిమాకి ఓటిటినుండి విపరీతమైన ఆదరణ దక్కింది. మరి తెలుగులోనూ ఇరట్ట ని చూసేసి ఆనందించెయ్యండి.

Iratta Telugu Version now streaming on Netflix:

Joju George Iratta Telugu Version now streaming on Netflix

Tags:   JOJU GEORGE, IRATTA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ