అసలైతే సోషల్ మీడియాలో వచ్చిన డేట్ ప్రకారం NTR30 ఓపెనింగ్ ఈరోజు హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరగబోతుంది అని వచ్చింది. గత నెల 24 న NTR30 అఫీషియల్ గా మొదలుకావాల్సి ఉన్నప్పటికీ తారకరత్న మరణంతో దానిని ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ లు పోస్ట్ పోన్ చేసారు. మళ్ళీ మార్చి 15 న అన్నారు కానీ.. ఇప్పుడు మార్చ్ 18 న NTR30 కి ముహూర్తం పెట్టారు.
అందుకే తారక్ కూడా అమెరికా లో ఇంకా కొద్దిగా ఆస్కార్ సందడి మిగిలి ఉన్నా హడావిడిగా NTR30 ఓపెనింగ్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ కి వచ్చేసారు. ఆయన ఈరోజే అమెరికా నుండి హైదరాబాద్ కి తిరిగి వచ్చారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో మార్చ్ 18న అంగరంగ వైభవంగా అతిరథమహారధుల మధ్యన మొదలు కానున్నట్లుగా తెలుస్తుంది. హీరోయిన్ జాన్వీ కపూర్ తో పాటుగా.. ఇండస్ట్రీలోని ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం.
మార్చ్ 18 న పూజా కార్యక్రమాలతో మొదలు కానున్న ఈ చిత్రం ఈ నెల 29 నుండి రెగ్యులర్ షూట్ కి వెళ్లనున్నట్టుగా తెలుస్తుంది. మొదటి షెడ్యూల్ నే భారీ సముద్రం సెట్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రానికి కొరటాల శివ ప్లాన్ చేశారట. ఇక విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పేరు NTR30 విలన్ లిస్ట్ లో గట్టిగా వినిపిస్తుంది.