మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ హై కోర్టు షాకిచ్చింది. ఆయన కొన్న ఓ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చెప్పకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో కొనుగోలు చేసిన స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వివాదాస్పద భూమి కావడంతో ప్రస్తుతం దానిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు అని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ప్రజల ఉపయోగం కోసం ఉంచిన 595 చదరపు గజాల స్థలాన్ని జూబ్లీహిల్స్ సొసైటీ మెగాస్టార్ చిరంజీవికి అక్రమంగా విక్రయించిందంటూ శ్రీకాంత్ బాబు, ఇతరులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ స్థలంపై జీహెచ్ఎంసీ నియంత్రణ లేకపోవడంతో నిబంధనలు ఉల్లంఘించి జూబ్లీహిల్స్ సొసైటీ దానిని చిరంజీవికి విక్రయించిందని పిటిషనర్లు ఆరోపించడమే కాకుండా.. సొసైటీ నుండి కొనుగోలు చేసిన భూమిలో చిరంజీవి నిర్మాణాలు కూడా చేప్టటారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
పిటిషనర్లు, న్యాయవాదుల మధ్యన వాదనలు విన్న తెలంగాణ కోర్టు కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని జీహెచ్ఎంసీ, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీని ఆదేశించిస్తూ తదుపరి విచారన్నాయి వచ్చే నెల 25 కి వాయిదా వేసింది.